యూనిఫాంలో లేడీ గురించే...: వివాదంపై షారూక్

ముంబై: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో యూనిఫాంలో ఉన్న మహిళా అధికారితో నృత్యం చేయడంపై తలెత్తిన వివాదం గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ పెదవి విప్పారు. వివాదం యూనిఫాం గురించి కాదని, యూనిఫాంలో మహిళపై అని, పురుషులకూ మహిళలకూ మధ్య అలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.

"ఇది చాలా విచిత్రం. నాలుగైదు ఎళ్ల క్రితం నేను వీర్ జారా అనే సినిమా కోసం యూనిఫాంలో ఉన్న జవాన్లతో నృత్యం చేశాను. 60, 70 దశకాల్లో ప్రోత్సాహం అందించడానికి చాలా మంది నటులు సరిహద్దుల్లో జవాన్ల కోసం ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు తొలిసారి యూనిఫాం.. అది కూడా యూనిఫాంలో ఇన్‌స్పెక్టర్ గురించి... పురుషులకూ మహిళలకు మధ్య ఉన్న ఈ తేడా చెత్త.. వెర్రి.. దాని గురించి నేను అసలు మాట్లాడకూడదు" అని అన్నారు.

Shah Rukh Khan on Kolkata Controversy

ఓ కార్యక్రమంలో షారూక్ ఖాన్ కోల్‌కతాలో సబ్ ఇన్‌స్పెక్టర్ సాంపా హల్దార్‌తో కలిసి షారూక్ ఖాన్ నృత్యం చేయడాన్ని రాజకీయ నాయకులు తప్పు పట్టారు. జబ్ తక్ హై జాన్ అనే పాటకు ఆమె షారూక్‌తో కలిసి నాట్యం చేశారు.

నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోల్‌కతా పోలీసు వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో జరిగిన ఆ ప్రదర్శనను పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్యాలరీ నుంచి తిలకించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+