పనిమనిషిపై రేప్: డ్రైవర్‌తో సంబంధం లేదన్న షారూక్
ముంబై: బాలీవుడ్ నటి సంగీతా బిజ్లాని ఇంటి మైనర్ బాలిక అయిన పనిమనిషిపై అత్యాచారం చేసిన తన కారు డ్రైవర్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ స్పష్టం చేశాడు. తనకున్న అనేక కార్లలో ఒక కారును అతను నడుపుతాడే గానీ తనకు అతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
కాగా, బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీ ఇంటి పని మనిషిపై బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆతనని ముంబై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సంగీతా బిజ్లాని ఇంట్లో 17 మైనర్ బాలిక పని మనిషిగా ఉంది.

ఈమెపై షారూక్ ఖాన్ కారు డ్రైవర్ పింటు మిశ్రా జూన్ 20వ తేదీన నలసోపారా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌లో అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. షారూఖ్ నివాసంలో పని కల్పిస్తానని చెప్పి రేప్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది.
కాగా, సంగీతా బిజ్లాని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ భార్య అన్న సంగతి తెలిసిందే. మొదటి భార్యకు విడాకులిచ్చిన అజహర్ మోడల్, నటి అయిన సంగీతను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.












Click it and Unblock the Notifications