మోడీ పాలన బాగుంది, వారు మూర్ఖులు: షారుక్ ఖాన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలన అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. నేను ఎప్పుడు అభివృద్ధిని హర్షిస్తానని చెప్పారు. ప్రధాని మోడీ ఇలాగే అభివృద్ధి దిశలో దేశాన్ని నడిపిస్తారని భావిస్తున్నానన్నారు.
అసహనంపై కూడా అతను మరోసారి పెదవి విప్పారు. తాను లౌకికవాదిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అసహనంపై దేశవ్యాప్తంగా చర్చ గురించి ప్రశ్నించగా.. ఆ విషయం గురించి నిజంగా తనకు తెలియదన్నారు.

నేను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెబుతానని, మంచి విషయాలు మాట్లాడుతానని అన్నారు. మనం ముందుకు సాగాలంటే లింగ, వర్ణ వివక్ష, ప్రాంత, మత తదితర వివక్షలు ఉండవద్దన్నారు. నీ కంటే నేను ఎక్కువ దేశభక్తుడిని అనే ఎవరైనా చెబితే అతను స్టుపిడ్ (మూర్ఖుడు) అంటానన్నారు. మనమంతా దేశభక్తులమే అన్నారు.












Click it and Unblock the Notifications