నవాజ్, నక్వీ ముస్లిం మహిళలను పెళ్లి చేసుకోవాలి: ఆజంఖాన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆయన ఇద్దరు బిజెపి సీనియర్ నాయకులకు సలహా ఇచ్చారు. హిందూ సమాజానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా వారిద్దరు లవ్ జిహాద్‌కు పాల్పడ్డారని, ఇప్పుడు వారు ముస్లిం మహిళలను కూడా పెళ్లి చేసుకోవాలని ఆయన అన్నారు.
బిజెపి నాయకులు షానవాజ్, ముక్తార్ అబ్బాస్ నక్వీలను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. మన మతంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చునని, దీనిపై సాధ్వీ ప్రాచీ కూడా దీనిపై మాట్లాడాలని, ఒక మహిళ 40 మంది పిల్లలను కనలేదు కదా ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
బిజెపి నేతలు షానవాజ్ ఖాన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ హిండూ మహిళలను వివాహం చేసుకోవడంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బస్సు నడిపి ఆజంఖాన్ వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజాం ఖాన్‌పై అందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని బుధవారం బేజీపీ డిమాండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ విషయంపై మౌనంగా ఉండటం 'ఏమి చేయలేని నిస్సహాయతను చూపిస్తుంది' అని బీజేపీ నేత విజయ్ బహుదూర్ పాఠక్ అన్నారు.
విద్యార్ధులు, ప్రయాణీకులతో ఉన్న బస్సును వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బాధ్యతా రహితంగా ఓ మంత్రి ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ ప్రభుత్వం మాట్లడపోవడం చేతగాని తనమే అవుతుందని పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications