ఎన్సీబీ విచారణలో ఏడ్చేసిన షారూక్ తనయుడు; నాలుగేళ్ళుగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ మత్తులో; బెయిల్ కోసం దిగ్గజ లాయర్
ప్రస్తుతం బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ లో దీనిపై పెద్ద చర్చ కొనసాగుతోంది. షిప్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పై విచారణ జరుపుతున్న అధికారులు, రేవ్ పార్టీ ఎవరు నిర్వహిస్తున్నారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరున్నారో అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ క్రిమినల్ లాయర్ షారూఖ్ తనయుడి బెయిల్ కోసం రంగంలోకి దిగుతున్నారు.

నాలుగేళ్ళుగా డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించిన ఎన్సీబీ అధికారులు
షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను విచారిస్తున్న అధికారులు నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించామని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. ఆర్యన్ ఖాన్ యూ కె మరియు దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకునే వాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్ట్ చేసిన తర్వాత, ఆర్యన్ ఖాన్ విచారణలో ఏడుస్తూనే ఉన్నాడని, దాంతో షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ కు ఫోన్ చేసి మాట్లాడారని, కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని తెలుస్తుంది.

ఆర్యన్ బెయిల్ కోసం క్రిమినల్ లాయర్ సతీష్ మానషిండే
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోసం ఆర్యన్ తరఫున వాదించటం కోసం క్రిమినల్ లాయర్ గా పేరుగాంచిన సతీష్ మానషిండే రంగంలోకి దిగినట్టు సమాచారం. రాంజెఠ్మలానీ వద్ద పనిచేసిన ఈయన బాలీవుడ్ కి చెందిన చాలా హై ప్రొఫైల్ కేసులను వాదించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి తరఫున ఈయన వాదిస్తున్నారు. 2002లో సల్మాన్ ఖాన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా సతీష్ మనిషినే వాదించారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఇరుక్కున్నప్పుడు సల్మాన్ తరపున ఆయన వాదనను వినిపించారు. అంతేకాదు 1993లో ముంబయి బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి సంజయ్ దత్ తరఫున వాదించి ఆయనకు బెయిల్ వచ్చేలా చేశారు.ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కేసును కూడా ఆయనే టేకప్ చేసినట్లుగా తెలుస్తోంది.

ముంబై క్రూయిజ్ లో భారీ రేవ్ పార్టీ, డ్రగ్స్ .. అరెస్ట్ అయిన 8 మంది విచారణ
ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్ లో రేవ్ పార్టీని నిర్వహించిన ఒక రోజు తర్వాత మొత్తం 8 మందిని ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఇక వీరిలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు, మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక మరియు విక్రాంత్ చోకర్‌లు కూడా అరెస్టయ్యారు. ఆర్యన్ ఖాన్ మరియు అర్బాజ్ దాదాపు 15 సంవత్సరాలుగా స్నేహితులు.

ఆర్యన్ ఖాన్ పై నమోదైన సెక్షన్లు ఇవే
ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచా మరియు అర్బాజ్ మర్చంట్‌ను ఆదివారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు, వారికి అక్టోబర్ 4 వరకు ఎన్‌సిబి కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్‌పై సెక్షన్ 27 (ఏదైనా మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు శిక్ష), 8C (ఉత్పత్తి, తయారీ, కలిగి, విక్రయించడం లేదా కొనుగోలు), నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ (NDPS) లోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది.












Click it and Unblock the Notifications