కేరళ అందాలు చూసొద్దామా..? తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..!

దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో కేరళ ఒకటి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ లో ఉన్న సహజమైన ప్రకృతి అందాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తుంటారు. పర్యటకులకు స్వర్గధామంగా ఇక్కడి ప్రదేశాలు కనువిందు చేస్తాయి. అందుకే సెలవులు వచ్చాయంటే పర్యటకులకు ఫస్ట్ ఆప్షన్ కేరళే ఉంటుంది. ఇక్కడి టీ, కాఫీ తోటలు, కొండలు, కోనలు, జలపాతాలు, ఘాట్ రోడ్లు.. పర్యటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.

ఇటీవలి కాలంలో చాలామంది వీకెండ్ టూర్ కు ఇష్టపడుతున్నారు. వీక్ మొత్తం ఉద్యోగాల్లో గడిపి.. వీకెండ్ లో ఫ్యామిలీతో అలా సరదాగా నగరాలను దాటి పచ్చని ప్రకృతి ప్రదేశాలను వెతుక్కుంటున్నారు. ఇక సెలవులు అయినా వీకెండ్ అయినా పర్యటకులకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చే ప్రదేశం కేరళ. కేరళ అందాలను మాటల్లో చెప్పలేము.. తనివితీరా ఆస్వాదించాల్సిందే. ఈ ప్రాంతంలో పచ్చదనం పరుచుకొన్న కొండలు.. వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు, అందమైన లోయలు టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని ఇడుక్కి జిల్లా ఓ స్వర్గం లా ఉంటుంది.

ఇడుక్కి తోపాటుగా కేరళలో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మొదటగా అల్లెప్పి.. కేరళలోని స్వర్గధామంగా ఈ ప్రాంతం ఉంటుంది. అల్లెప్పిలోని వెంబనాడ్ సరస్సు దృశ్యాలు పర్యటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ సరస్సులో బోటింగ్‌ ను కూడా ఆస్వాదించొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే అలెప్పీలో హౌస్‌ బోట్ అనుభవం కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇక కన్నూర్ లోని ముజప్పిలంగడ్ బీచ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని పొడవైన డ్రైవ్-ఇన్ బీచ్ లలో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ టూరిస్టులు కారు లేదా బైక్‌ ను ఇసుకపైనే నడుపుతూ డ్రైవ్ చేసే వీలుంది. డ్రైవింగ్ చేస్తూ ఇక్కడి అందాలను పూర్తిగా కవర్ చేయొచ్చు. అలాగే అంతరించిపోతున్న అనేక రకాల పక్షులను ఈ ప్రదేశంలో చూడొచ్చు.

వర్కల ప్రాంతంలోని కప్పిల్ బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ వైపు సముద్రం, మరొక వైపు బ్యాక్‌ వాటర్‌ లో కొబ్బరి చెట్ల అందాలు.. అబ్బో ఇదో కొత్త అనుభూతి. అందుకే ఈ కప్పిల్ బీచ్ అందాలను చూసేందుకు టూరిస్టులు ఎగబడతారు. అంతేకాక ఈ బీచ్‌ నుంచి అరేబియా సముద్రంలో సూర్యాస్తమం కూడా చూడొచ్చు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. అలాగే కేరళలో మరో చెప్పుకోదగ్గ ప్రదేశం మున్నార్.. ఇక్కడి పర్వతాల నుంచి విశాలమైన పచ్చదనాన్ని చూడటం మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. అందుకే కేరళలోని ఈ హిల్ స్టేషన్ ఎప్పుడూ పర్యటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భారీ తేయాకు తోటలు, పచ్చని దారులు, ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్ మొదలైనవి ఇక్కడ ఉన్నాయి.

Shall We Go and See the Beauty of Kerala Top 6 Must-See Gems for 2026 Adventures

అలాగే కొల్లంలోని అష్టముడి సరస్సు అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. తేక్కడి హిల్ స్టేషన్‌లో పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, తిరువనంతపురం నగరంలో ఉన్న కోవలం బీచ్‌, అంతేకాక కేరళలోని పాపులర్ హిల్ స్టేషన్‌ అయిన వాగమోన్ ఇలా అనేక ప్రదేశాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. విమాన సదుపాయం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా కేరళకు చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+