Surya Grahan 2022: 30 ఏళ్ల తరువాత కుంభరాశిలోకి శని సంచారం: గ్రహగతుల్లో కీలక మార్పులు

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం శనివారం ఏర్పడబోతోంది. శని అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించనుంది. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించదు. అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది.

30 సంవత్సరాల తరువాత..

30 సంవత్సరాల తరువాత..

అమెరికా దక్షిణ ప్రాంతంతో పాటు చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియా నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరు. ఈ సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. శని- కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 30 సంవత్సరాల తరువాత ఈ పరిణామం చోటు చేసుకోనుంది. ప్రస్తుతం శని సంచారం మకర రాశిలో కొనసాగుతోంది. రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశిలో సంచరించాడు శనిదేవుడు.

 కుంభరాశిలోకి..

కుంభరాశిలోకి..


ఇప్పుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి- శని దేవుడికి అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. శని దేవుడు అత్ంయత నెమ్మదిగా సంచరిస్తుంటాడనే విషయం తెలిసిందే. ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు పరిభ్రమిస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే జరుగనుంది. కుంభరాశిలో రెండున్నర సంవత్సరాల కాలం పాటు సంచరిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశులపైనా పడుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వారికి ఇబ్బందులు..

వారికి ఇబ్బందులు..

కొన్ని రాశుల వారి ఇబ్బందులు తీవ్రతరం కావడం.. మరి కొందరి కష్టాలు క్రమంగా తగ్గముఖం పట్టడం వంటి జ్యోతిష్యపరమైన పరిణామాలు సంభవిస్తాయని అంటున్నారు. మేష రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తోన్నారు. కోర్టు వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. వాగ్వివాదాలకు వెళ్లడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఆదాయ పరంగా నష్టాలు తప్పకపోవచ్చనని, రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడొచ్చని చెబుతున్నారు.

 సానుకూలంగా గ్రహసంచారం..

సానుకూలంగా గ్రహసంచారం..

శనిదేవుడి గ్రహసంచారం వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం రాశుల వారిపై సానుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. రుణ సంబంధ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సంఘంలో పలుకుబడిని సాధిస్తారు. ఉద్యోగరంగంలో స్థిరపడిన వారి బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారి ఆదాయం బాగుంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి అష్టమ దశ శని ప్రభావం తొలగిపోతుంది.

 సింహరాశి వారు శ్రమించక తప్పదు..

సింహరాశి వారు శ్రమించక తప్పదు..


సింహ రాశి వారికి ఈ గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు. ఆదాయం పెరుగినా, దానికి అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం, వృత్తిరీత్యా ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు శ్రమించాల్సి ఉంటుంది. అనవసర ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. అనవసర ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని దురలవాట్లు ఉన్నవారు వాటిని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యం బాగుంటుంది గానీ..

ఆరోగ్యం బాగుంటుంది గానీ..


కన్య, ధనస్సు రాశి వారికి అర్థికం, ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. తల పెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. నిర్వహించ తలపెట్టిన పనులు ఓ కొలిక్కి వస్తాయి. మధ్యలో ఉన్న పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార లావాదేవీల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ.. అవి సానుకూలంగా ముగుస్తాయి. ఇల్లుగానీ, స్థలంగానీ కొనే అవకాశం ఉంది.

మకర రాశిపై మిగులు ప్రభావం..

మకర రాశిపై మిగులు ప్రభావం..

మకర రాశి నుంచి శని కుంభరాశిలోకి మారుతుండటం వల్ల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు పెరుగినా.. దానికి అనుగుణంగా ఆదాయ వనరులు మెరుగుపడతాయి. కాస్త కష్టపడితే గానీ పనులు పూర్తి కాలేకపోవచ్చు. శని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పడుతుందని, అందువల్లే ఇంకొద్ది రోజుల పాటు ఈ ఇబ్బందులు తప్పకపోవచ్చిన జ్యోతిష్యులు చెబుతున్నారు.

కుంభం, మీనరాశులపై మిశ్రమ ఫలితాలు..

కుంభం, మీనరాశులపై మిశ్రమ ఫలితాలు..

కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, రుణాల నుంచి విముక్తి కావడం వంటి ఆనందాన్ని ఇస్తాయి. శని సంచారం వల్ల పనులు నెమ్మదిస్తాయి. ఆరోగ్యం పట్ల శద్ధ అవసరం. ఒత్తిడి అధికమౌతుంది. అధ్యాత్మిక చింతనను పెంచుకోవడం అవసరమౌతుంది. మీన రాశి వారికి ఈ గ్రహ సంచారం వల్ల ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలు కలిసి రాకపోవచ్చు. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+