నిండు సభలో మహిళల చర్మ, శరీరాలపై శరద్ యాదవ్ వ్యాఖ్యలు, అభ్యంతరం తెలిపిన కనిమొళి

న్యూఢిల్లీ: జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ దక్షిణ భారత మహిళలపై రాజ్యసభలో సంచలన వ్యాఖ్యాలు చేశారు. గురువారం నాడు రాజ్యసభలో ఇన్యూరెన్స్ బిల్లు సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మీ దేవుడేమో రవిశంకర్ ప్రసాద్ (ఎంపీ)లాగా నల్లనివాడు. మీ మ్యారేజి బ్యూరో యాడ్స్‌లో మాత్రం తెల్లని వధువులు కావాలని ప్రకటనలిస్తారు" అని దక్షిణ భారతదేశానికి చెందిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అనంతరం ఆయన మహిళల అందంపై గురించి మాట్లాడారు. "దక్షిణ భారతదేశంలో మహిళలు నల్లగా ఉంటారు. అయితే, వారి అందం కూడా వారి శరీరాల్లాగే ఉంటుంది. వారికి నాట్యం గురించి తెలుసు " అని పేర్కొన్నారు.

Sharad Yadav comments on skin, body of south Indian women in Rajya Sabha

ఆ తర్వాత నిర్భయ ఉదంతాన్ని ఇండియాస్ డాటర్ పేరుతో డాక్యుమెంటరీ తీసిన మహిళా దర్శకురాలు లెస్లీ ఉద్విన్ గురించి చెబుతూ, ఆమె తన తెల్ల తోలు కారణంగానే, రేపిస్టుల ఇంటర్యూలకు సులభంగా అనుమతి సంపాదించి ఉంటుందని వ్యాఖ్యానించారు.

దీంతో రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలపై ఎంపీ కనిమొళి అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చపై దృష్టి పెట్టాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+