టితో ముందస్తుకు ఛాన్స్, రిజైన్లబాటలో ఎంపీలు!: పవార్
ముంబై: తెలంగాణ విభజన అంశం నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ఎన్నికలకు అవకాశం కనిపిస్తోందని కేంద్రమంత్రి, ఎన్సిపీ అధినేత శరద్ పవార్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయొచ్చునని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంశం తీవ్రమైన రాజకీయ చిక్కుముడిగా మారుతున్నదని, తనకు తెలిసిన మేరకు, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన చాలామంది పార్లమెంటు సభ్యులు తమ లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతున్నారని, అదే జరిగితే గడువు కన్నా ముందే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో కలిసే పోటీ చేస్తామని చెప్పారు. అదే సమయంలో తాను ఈసారి లోక్‌సభకు పోటీ చేయడం లేదని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో అడుగుపెడతానని వివరించారు.
ఆర్డినెన్స్ విషయమై రేగిన వివాదం గురించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అలాగే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించగా, సూటిగా సమాధానం ఇవ్వలేదు. గెలుద్దామని పోటీ చేస్తున్నానని చెప్పి ముక్తాయించారు.












Click it and Unblock the Notifications