అలా అయితే ప్రత్యర్థినే: రజనీపై వెనక్కి తగ్గిన శరత్

రజినీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శరత్ కుమార్ తాను అలా అనలేదని వివరణ ఇచ్చారు. రజనీకాంత్‌పై తాను చేసిన ప్రకటనపై వివరణ ఇచ్చారు.

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన ప్రకటనపై సినీ నటుడు శరత్ కుమార్ వెనక్కి తగ్గారు. తాను అలా అనలేదని వివరణ ఇచ్చారు. రజినీకాంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రజినీకాంత్ అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో శరత్ కుమార్ తాను చేసిన ప్రకటనపై వివరణ ఇచ్చారు.

రజినీకాంత్‌తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని స్పష్టం చేశారు. రజినీకాంత్‌కు రాజకీయ పార్టీ పెట్టే అర్హతన లేదని తాను అనలేదని చెప్పారు. తన మాటలను కొందరు వక్రీకరించారని ఆయన చెప్పారు. రజినీకాంత్ గురించి తాను మాట్లాడలేదని, మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించడంతో తాను స్పందించానని అన్నారు.

Sharatkumar clarifies on his sttaement on Rajinikanth

రజనీకాంత్ తనకు మిత్రుడని, రజనీ రాజకీయ పార్టీ పెడితే మాత్రం తాను ప్రత్యర్థిగానే భావిస్తానని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆయన వివరణ ఇచ్చారు. తమిళనాడును పాలించేది తమిళులే కావాలనేది తన అభిప్రాయమని చెప్పారు. జయలలిత మరణించిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని చాలా మంది రజనీకాంత్‌ను కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే శరత్ కుమార్ రజనీపై స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకో విస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని చెప్పారు. కాగా, రజినీకాంత్ అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+