షార్ప్ షూటర్, కిల్లర్ కార్తిక్ అరెస్టు
అహమ్మదాబాద్: షార్ప్ షూటర్, కిల్లర్ కార్తిక్ హల్దార్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు. వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపు కేసులో ముగ్గురు సాక్షులను ఇతను అతి దారుణంగా కాల్చి చంపాడని అధికారులు అనుమానిస్తున్నారు. కార్తిక్ హల్దార్ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం చాకచక్యంగా ఏటీఎస్ అధికారులు కార్తిక్ హల్దార్ ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని వివాదాస్పద మత గురువు ఆశారాం బాపు మీద ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

2013లో ఆశారాం బాపును పోలీసు అధికారులు అరెస్టు చేశారు. తరువాత నారాయణ సాయి ని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. 2001 -2005 మధ్య కాలంలో నారాయణసాయి తన మీద అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్ లోని సూరత్ పోలీసులకు ఫిర్యాదు.
ఆ మహిళ 2013లో ఫిర్యాదు చెయ్యడంతో విచారణ చేసిన పోలీసు అధికారులు అప్పుడే నారాయణసాయిని అరెస్టు చేశారు. ఆశారాం బాపు కేసులోని ముగ్గురు సాక్షులను కార్తిక్ హల్దార్ హత్య చెయ్యడంతో కేసు విచారణకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. కార్తిక్ హల్దార్ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఏటీఎస్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications