ఇదేం దిక్కుమాలిన పోలిక: బీజేపీ, కాంగ్రెస్‌లను సందిగ్ధంలో పడేసిన ఎంపీ!
Shashi Tharoor: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెర తీశాయి. అద్వాణీని మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో పోల్చడంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా దూరం పాటించగా.. బీజేపీకి ఈ పోలిక ఎలా అనిపించిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
అద్వాణీ పోలికపై వివాదం ఎందుకు?
నవంబర్ 8న అద్వాణీ పుట్టినరోజు సందర్భంగా శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ఎల్‌కే అద్వాణీ జీకి 98వ జన్మదిన శుభాకాంక్షలు! ప్రజా సేవ పట్ల ఆయన నిబద్ధత, ఆయన వినయం, మర్యాద, ఆధునిక భారతదేశ దిశను నిర్ణయించడంలో ఆయన పాత్ర చెరగనిది. ఒక నిజమైన రాజకీయ నాయకుడు, ఆయన సేవామయ జీవితం అనుకరణీయం." అని రాశారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "క్షమించండి మిస్టర్ థరూర్... ద్వేషపు బీజాలు నాటడం ప్రజా సేవ కాదు," అని పేర్కొంటూ రథయాత్ర, దాని హింసాత్మక వారసత్వం దేశాన్ని ఇంకా వెంటాడుతున్నాయని విమర్శించారు.

నెహ్రూ, ఇందిరాతో పోలిక
తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడానికి, శశి థరూర్ తన సొంత పార్టీకి చెందిన దివంగత నేతలను ఉదాహరణగా చూపారు. సంజయ్ హెగ్డేకి సమాధానం ఇస్తూ శశి థరూర్, "అద్వాణీ సుదీర్ఘ సేవను ఒక్క సంఘటనకే పరిమితం చేయడం తప్పు. నెహ్రూ పూర్తి రాజకీయ జీవితాన్ని చైనా వైఫల్యం ఆధారంగా అంచనా వేయలేం. అలాగే ఇందిరా గాంధీ కెరీర్‌ను కేవలం ఎమర్జెన్సీ కారణంగా మాత్రమే అంచనా వేయలేం... అద్వాణీ జీ పట్ల కూడా మనం అదే మర్యాదను చూపాలని నేను నమ్ముతున్నాను." అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ దూరం, బీజేపీకి ఇబ్బంది
అద్వాణీని నెహ్రూ, ఇందిరాలతో పోల్చడంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా స్పందిస్తూ.. "ఎప్పటిలాగే, డాక్టర్ శశి థరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తనను తాను ఆయన ప్రకటన నుంచి దూరంగా ఉంటుంది. " అని తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉండి కూడా థరూర్ ఇలాంటి ప్రకటన చేయడం కాంగ్రెస్ "విలక్షణమైన ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తిని" సూచిస్తుందని పవన్ ఖేడా చెప్పారు. కాంగ్రెస్ నేతలతో అద్వాణీని పోల్చడం బీజేపీకి సైద్ధాంతికంగా నచ్చలేదు. ప్రస్తుతం బీజేపీ నాయకత్వం అద్వాణీని కేవలం గౌరవ చిహ్నంగా మాత్రమే చూస్తున్నందున ఈ పోలిక బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది.
తరచూ వివాదాల్లో థరూర్
శశి థరూర్ ఇటీవల చేసిన పలు ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై ఆయన రాసిన వ్యాసంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వంటి నేతలను ప్రస్తావించడం కూడా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.2014 తర్వాత బీజేపీ నాయకత్వంపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై శశిథరూర్ సానుకూల వైఖరిని ప్రదర్శించడం అనేక సందర్భాల్లో కనిపించింది. విదేశాంగ విధానం వంటి జాతీయ ప్రయోజన అంశాలపై థరూర్ స్టాండ్ మోదీకి కూడా నచ్చడం, ఆయనను పార్లమెంట్‌లో ప్రశంసించడం వంటివి జరిగాయి. అయితే తాజా పోలికతో థరూర్ రెండు పార్టీల ఆగ్రహాన్ని మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications