అదొక్కటి చాలదు: మోడీని ప్రశంసించి, బీజేపీని తిట్టిపోసిన శశిథరూర్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోడీ పైన మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆయన భారతీయ జనతా పార్టీని మాత్రం తిట్టిపోశారు. ప్రధాని మోడీ మాస్టర్ కమ్యూనికేటర్ అని కితాబిచ్చిన థరూర్.. బీజేపీ మాత్రం సరైన పార్టీ కాదని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో శశిథరూర్ మరోసారి మోడీకి కితాబివ్వడం గమనార్హం. ప్రధాని మోడీ తన పనితనంలో మాస్టర్ కమ్యూనికేటర్‌గా కనిపిస్తున్నారని, కానీ బీజేపీ మాత్రం సంకుచిత దృక్పథంతో హిందుత్వ అజెండాతో ముందుకు పోతోందని ట్విస్ట్ ఇచ్చారు. ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

ఇంకా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ మాటలలో ఆరితేరిన వ్యక్తి అన్నారు. అయితే అదొక్కటే సరిపోదని చెప్పారు. ఆయన మాటలన్నీ ఎప్పుడు ఆచరణకు నోచుకుంటాయో చెప్పాలని ప్రశ్నించారు. సమాచారమే ఎన్డీయేకు ఉన్న పెద్ద బలమన్నారు. బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రధాని మోడీ నినాదాలతో, ఫోటో ఆప్స్‌తో దూసుకుపోతున్నారని చెప్పారు.
ప్రధాని మోడీ పైన ఇటీవలి కాలంలో పలుమార్లు శశిథరూర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 2014లో ప్రధాని మోడీకి కితాబిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనను అధికార ప్రతినిధి పదవి నుండి తప్పించింది. తాను బీజేపీని వెనుకేసుకు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన గతంలో చెప్పారు.












Click it and Unblock the Notifications