శశిథరూర్‌కి పాక్ మహిళతో లింక్: భార్య డైవర్స్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశి థరూర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. దాని నుంచి ఓ పాకిస్థానీ జర్నలిస్టుకు కొన్ని సరదా వ్యాఖ్యలు వెళ్లాయి. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, అసౌకర్యంపై విచారిస్తున్నానని, తన పాలోయర్లను ఉద్దేశించి శశి థరూర్ తన పేజీలో చెప్పారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్న్టట్లు పేర్కొన్నారు.
శశి థరూర్, సునందల మధ్య విభేదాలు
మరోవైపు శశి థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్‌కు మధ్య పొరపొచ్చలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. థరూర్ నుండి తాను విడాకులు కోరనున్నట్లు భార్య సునంద తెలిపారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... భర్త శశికి పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. తాను తప్పకుండా భర్త నుండి విడాకులు కోరుతానని తెలిపారు.
తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురయిందని శశిథరూర్ చెప్పిన కొద్ది సేపట్లోనే సునంద తన భర్తకు పాక్ జర్నలిస్టు మెహర్ తరర్‌తో వివాహేతర సంబంధం ఉందని చెప్పడం గమనార్హం.
అయితే, గురువారం శశి థరూర్, సునంద పుష్కర్‌లు జంటగా ట్విట్టర్ దుమారంపై ఓ ప్రకటన విడుదల చేశారు. తాము వివాహం అనంతరం ఆనందంగా గడుపుతున్నామని, ఈ రాద్దాంతం తమకు బాధ కలిగిస్తోందని వారు విజ్ఞప్తి చేశారు.
ట్విస్ట్
శశి థరూర్ ట్విట్టర్ హ్యాకింగ్ కావడంతో వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తన భర్తకు పాకిస్తాన్ జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందన్న సునంద పుష్కర్ మరో విధంగా కూడా మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాక్ జర్నలిస్టు మెహర్ తన భర్తను వేధిస్తున్నారని పేర్కొన్న సునంద.. ఆమెను ఐఎస్ఐ ఏజెంట్‌గా పేర్కొన్నారు. దీనిపై మెహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మధ్య సంబంధాన్ని చెడగొట్టేందుకు పాక్ జర్నలిస్టు ప్రయత్నించారని ఆరోపించారు.

శశి - సునంద 1
కేంద్రమంత్రి శశి థరూర్ ట్విట్టర్ అకౌంట్లోకి పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆ అకౌంట్లో కొన్ని సరదా వ్యాఖ్యలు రాశారు.

శశి - సునంద 2
కేంద్రమంత్రి శశి థరూర్ ట్విట్టర్ అకౌంట్లోకి పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆ అకౌంట్లో కొన్ని సరదా వ్యాఖ్యలు రాశారు. ఇది దుమారం రేపుతోంది.

శశి - సునంద 3
తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, అసౌకర్యంపై విచారిస్తున్నానని, తన పాలోయర్లను ఉద్దేశించి శశి థరూర్ తన పేజీలో చెప్పారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్న్టట్లు పేర్కొన్నారు.

శశి - సునంద 4
మరోవైపు శశి థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్‌కు మధ్య పొరపొచ్చలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. థరూర్ నుండి తాను విడాకులు కోరనున్నట్లు భార్య సునంద తెలిపారు.

శశి - సునంద 5
శశి థరూర్ ట్విట్టర్ హ్యాకింగ్ కావడంతో వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తన భర్తకు పాకిస్తాన్ జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందన్న సునంద పుష్కర్ మరో విధంగా కూడా మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications