టైటానిక్ హీరో: రజనీకాంత్‌కు శతృఘ్ను సిన్హా సలహా, బిజెపికి ఝలక్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇటీవలి కాలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయ ఆరంగేట్రంపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ శతృఘ్ను సిన్హా ఓ సలహా ఇచ్చారు.
పాట్నా/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఇటీవలి కాలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయ ఆరంగేట్రంపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ శతృఘ్ను సిన్హా ఓ సలహా ఇచ్చారు.
రజనీ రాజకీయ ప్రవేశంపై ఆయన గురువారం వరుసగా ట్వీట్లు చేశారు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇదే సరైన సమయమని, దేశమొత్తం నీ రాకకోసం ఎదురుచూస్తోందని, దేశం, ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ప్రజలు నీ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు.
టైటానిక్ హీరో ఆఫ్ తమిళనాడు, భరతమాత ముద్దు బిడ్డ అంటూ రజనీకాంత్‌పై శత్రుఘ్నసిన్హా ప్రశంసలు కురిపించారు.

అంతేకాదు, ఓ స్నేహితుడిగా ఆయనకు అండగా ఉంటానని, మద్దతు ఇస్తానని, గైడ్‌గా ఉంటానని పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా నా సహాయం మీరు ఆశించవచ్చునని రజనీకి సూచించారు.
ఇప్పటికే రజనీకాంత్‌ను తమ పార్టీలో చేరాలని బిజెపి ఆహ్వానిస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా ఒకటికి రెండుసార్లు ఆహ్వానించారు. కానీ శతృఘ్ను సిన్హా మాత్రం రజనీ ఏ పార్టీలోనైనా చేరవచ్చునని బిజెపికి షాకిచ్చారు. కాగా, పలు సందర్భాల్లో ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications