ఆమె ముచ్చటపడి అడిగింది.. ప్రధాని ఇచ్చేశారు!
ట్విట్టర్ ద్వారా ఓ మహిళ తనకు పంపించిన అభ్యర్థనకు తక్షణమే స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ ఆమె ముచ్చటపడి అడిగిన కోరికను తీర్చారు.
న్యూఢిల్లీ: ట్విట్టర్ లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, అక్కడ చెప్పిన సమస్యలను పరిష్కరించడంలో నరేంద్రమోడీ మంత్రి వర్గం మంచి చురుగ్గా ఉంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంటి వాళ్లయితే నిమిషాల్లోనే స్పందించి సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
తాజాగా.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఈ ట్విట్టర్ సందేశానికి స్పందించిన వైనం వెలుగుచూసింది. మహాశివరాత్రి పర్వదినం రోజున తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. ఆ సందర్భంలో ఆయన తన మెడలో నీలి రంగు స్కార్ఫ్ ఒకటి ధరించారు.
Overwhelmed to receive blessings of Adiyogi from modern India's Karmayogi, PM @narendramodi, who is covering miles daily yet hears us all! 🙏 pic.twitter.com/QoT2pF6kK7
— shilpi tewari (@shilpitewari) February 25, 2017
శిల్పి తివారీ అనే మహిళకు ఆ స్కార్ఫ్ ఎంతగానో నచ్చింది. ట్విట్టర్ లో చురుగ్గా ఉండే ఆమె.. వెంటనే తనకు ఆ స్కార్ఫ్ కావాలంటూ ప్రధాని మోడీని ట్యాట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఒకే ఒక్క లైనులో చేసిన ఆ ట్వీట్ కు ప్రధాని వెంటనే స్పందించారు.
Overwhelmed to receive blessings of Adiyogi from modern India's Karmayogi, PM @narendramodi, who is covering miles daily yet hears us all! 🙏 pic.twitter.com/QoT2pF6kK7
— shilpi tewari (@shilpitewari) February 25, 2017
ఆమె చేసిన ట్వీట్ ను ప్రింట్ తీసి, దానిమీద స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి.. రెండూ ఆమెకు పార్సిల్ చేసేశారు. దీంతో ఆమె పరమానంద భరితమై.. మోడీ పంపిన స్కార్ఫ్ మెడలో ధరించి ఫొటో తీయించుకుని దాన్ని ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేసుకున్నారు. ఈ విషయం తెలిసి పలువురు శిల్పి తివారీని అభినందనలతో ముంచెత్తారు.
I am so stunned and overwhelmed right now that I am frozen .. can't think how to respond. Matlab kamaal hi kar diya.
— shilpi tewari (@shilpitewari) February 25, 2017
Along with the stole came this signed paper .. can you imagine a PM who listens to your voices and takes time to respond & personalise !! pic.twitter.com/epIuftIpfz
— shilpi tewari (@shilpitewari) February 25, 2017












Click it and Unblock the Notifications