నా భర్తే అప్పుడు రేప్, ఇప్పుడు..: గాయని హత్య కేసులో సోదరి సంచలనం
హర్యానాకు చెందిన గాయని హర్షితా దహియా(22) మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతురాలి సోదరి లత కీలక విషయాలను వెల్లడించారు. హర్షితను చంపింది తన భర్తేనని ఆమె పోలీసులకు తెలిపారు. ‘మా అ
చండీగఢ్: హర్యానాకు చెందిన గాయని హర్షితా దహియా(22) మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతురాలి సోదరి లత సంచలన విషయాలను వెల్లడించారు. హర్షితను చంపింది తన భర్తేనని ఆమె పోలీసులకు తెలిపారు.
'మా అమ్మ హత్యకేసులో హర్షిత సాక్షి. అందుకే నా భర్త ఆమెను చంపేశాడు' అని ఆమె తెలిపింది. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఇటీవలే హర్షిత యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. కొద్ది రోజులకే ఆమె హత్యకు గురికావడం గమనార్హం.

కాగా, హర్షితపై గతంలో లత భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు జైలు శిక్షను కూడా అనుభవించాడు. తాజాగా చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో హర్షిత, ఆమె తల్లి హత్యలపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recommended Video

ప్రముఖ "సింగర్" దారుణ హత్య! : Video | Oneindia Telugu












Click it and Unblock the Notifications