షీనా బోరా హత్య: ఇంద్రాణి మాజీ భర్త అరెస్టు

న్యూఢిల్లీ: షీనా బోరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేసులో నిందితురాలైన షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖార్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అరెస్టు చేశారు. షీనా హత్యలో ఆయన ఇంద్రాణికి సహకరించాడనే ఆరోపణలపై ఆ అరెస్టు జరిగింది.

ముంబై పోలీసులు సంజీవ్ ఖన్నాను కోల్‌కతాలో విచారించారు. షీనా బోరా తన భార్య ఇంద్రాణి కూతురు అనే విషయం తనకు ఇప్పటి వరకు తెలియదని, తనను చీకట్లో ఉంచారని పీటర్ ముఖార్జియా చెప్పారు. దీంతో హతురాలు ఇంద్రాణి సోదరి కాదు, కూతురు అనే విషయం వెలుగు చూసింది.

Sheena Bora murder: Indrani Mukerjea's former husband Sanjeev Khanna arrested

2012లో జరిగిన షీనా హత్య కేసులో ఖర్ పోలీసులు మంగళవారం సాయంత్రం ఇంద్రాణి ముఖార్జియాను అరెస్టు చేశారు. తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన చెప్పారు. ఇటువంటి నేరం జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదని ఆయన అన్నారు.

తనను తన భార్యను విశ్వసించానని, అది తనకూ తన కుమారుడికి మధ్య విభేదాలకు కూడా దారి తీసిందని ఆయన అన్నారు. అతనితో తాను మూడేళ్లుగా మాట్లాడలేదని చెప్పారు. షీనా అమెరికాలో చదువుకుంటోందని తాను నమ్ముతూ వచ్చినట్లు కూడా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+