వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్‌లే: ఇంద్రానీ తండ్రే ఆమె కుమార్తె షీనా తండ్రి ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: షీనా బోరా హత్య కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇంద్రానీ ముఖర్జియా తండ్రిగా చెబుతోన్న ఉపేంద్ర బోరా ఆమె నిజమైన తండ్రి కాదా? అంటే కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి.

ఉపేంద్ర బోరా ఇంద్రాని అలియాస్ పరి బోరా తండ్రి కాదని, అదే సమయంలో ఇంద్రానీ కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైన షీనా బోరాకు తండ్రి... ఇంద్రానీ తండ్రి ఉపేంద్రనే అని తెలుస్తోందని చెబుతున్నారు.

షీనా సర్టిఫికేట్ల పైన కూడా తండ్రి స్థానంలో ఉపేంద్ర పేరే ఉంది. తాత కావాల్సిన వ్యక్తి తండ్రి ఎలా అయ్యాడనేది అంతు చిక్కడం లేదు. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఊహించే ఇంద్రానీ... తన తండ్రి పేరును షీనా సర్టిఫికేట్ల పైన రాయించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే, ఇంద్రానీ తండ్రి ఉపేంద్ర కాదని కూడా చెబుతున్నారు. ఇంద్రానీ తన చిన్నతనంలో ఆమె తండ్రిగా చెబుతున్న ఉపేంద్రతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని, ముంబై పోలీసులకు తెలిసిందని సమాచారం. ఆయన ద్వారానే షీనాకు జన్మనిచ్చిందనే షాకింగ్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

షీనా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికాలో చదువుకుంటుందని భావిస్తున్న షీనా హత్యకు గురైందనే విషయం వెలుగు చూసింది. నాలుగు నెలల క్రితం అగంతకుడు ముంబై కమిషనర్‌కు ఫోన్ చేసి.. షీనా మూడేళ్లుగా కనిపించడంలేదని సమాచారం ఇచ్చారు.

దానిని సీరియస్‌గా తీసుకున్న కమిషనర్ విచారణకు ఆదేశించారు. అందరి పైన నిఘా ఉంచి, చివరకు ఇంద్రానీని అనుమానించారు. ఆ సమయానికి ఆమె విదేశీ పర్యటనలో ఉంది. ఆమె డ్రైవర్ శ్యాం రాయ్ పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. కేసు దర్యాఫ్తు రహస్యంగా ఉంచారు.

Sheena murder: Driver gives details

ఈ నెల మొదటి వారంలో ఇంద్రానీ స్వదేశానికి తిరిగి వచ్చారు. 21న డ్రైవర్ రాయ్‌‍ను పోలీసులు అక్రమాయుధాల కేసులో అరెస్టు చేశారు. విచారణలో షీనా బోరా హత్య గురించి వెల్లడైంది. ఈ హత్యలో ఇంద్రానీ, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంకు పాత్ర ఉందని గుర్తించారు.

25న పోలీసులు ఇంద్రానీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంద్రానీని, మాజీ భర్త సంజీవ్, డ్రైవర్ శ్యాంలను రహస్యంగా విచారిస్తున్నారు. దీంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇంద్రానీ అసలు పేరు పోరీ బోరా

ఇంద్రానీ అసలు పేరు పోరీ బోరా. అసోంలోని గౌహతిలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో 1972లో జన్మించింది. 14 ఏళ్ల వయస్సులో ఆమెకు సిద్ధార్థ దాస్‌తో పెళ్లైంది. 16 ఏళ్ల వయసుకే షీనా, మిఖాయిల్‌లకు జన్మను ఇచ్చింది. వారిని తండ్రిగా చెబుతున్న ఉపేంద్ర వద్ద వదిలేసింది.

సంజీవ్ ఖన్నాతో పరిచయమైంది. 1993లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి విధి అనే కుమార్తె జన్మించింది. ఇంద్రానీ, సంజీవ్ 2001లో ముంబైకి వచ్చారు. ఇంద్రానీ ఓ హెచ్ఆర్ కన్సల్టెన్సీ ప్రారంభించింది. 2002లో ఇంద్రానీతో పీటర్ ముఖర్జీయాతో పరిచయం అయింది.

ఇంద్రానీ రెండో భర్తతో విడాకులు తీసుకోకుండా పీటర్ తో సహజీవనం ప్రారంభించింది. 2002లో ఇంద్రానీ, పీటర్ వివాహం చేసుకున్నారు. విధి తన తండ్రితో వెళ్లిపోయింది. 2005లో తన పిల్లలను షీనా, మిఖాయిల్‌ను తీసుకు వచ్చి చెల్లి, సోదరుడిగా పరిచయం చేసింది.

కూతురు షీనా ఇంద్రానీ మూడో భర్త పీటర్ కొడుకు రాహుల్‌తో రిలేషన్ షిప్ మెయింటెన్ చేసింది. దీనిని భరించలేక హత్య చేసినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఆస్తి కోసం హత్య చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా పీటర్ ముఖర్జీని కూడా పోలీసులు విచారించనున్నారు.

Sheena murder: Driver gives details

ఎన్ని ట్విస్టులో..!

విచారణలో షీలాను తాము చంపలేదంటే తాము చంపలేదని ఇంద్రానీ, సంజీవ్, డ్రైవర్ చెప్పారు. సంజీవ్ గొంతు నులిమారని ఇంద్రానీ చెబితే, తాను నిద్రలేచేసరికి చనిపోయి ఉందని సంజీవ్ చెప్పారు. తాను డ్రైవింగ్ చేస్తున్నానని డ్రైవర్ చెప్పారు.

తన కూతురు షీనా, కొడుకు మిఖాయిల్‌లను ఇంద్రానీ తన సోదరి, సోదరుడిగా మూడో భర్తకు పరిచయం చేసింది. పదేళ్ల పాటు ఈ విషయాన్ని వెల్లడించలేదు.

తాను ఇంద్రానీ కూతురునని షీనా, అదే విషయాన్ని షీనా ప్రియుడు రాహుల్ చెప్పినా పీటర్ ముఖర్జీయా... ఇంద్రనీ మాటలనే నమ్మారు.

ఇంద్రానీ.. పీటర్ ముఖర్జీయాను మూడో పెళ్లి చేసుకుంది. ఇంద్రానీ కూతురు, పీటర్ తనయుడు రిలేషన్ షిప్ మెయింటెన్ చేశారు. ఇది దంపతులకు నచ్చలేదు.

షీనా హత్య పైన ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదనేది తేల్చవలసి ఉంది. ఆస్తి కోసం చంపారని, కాదు ఆమె రాహుల్‌తో రిలేషన్ షిప్ మెయింటెన్ చేయడం వల్ల అని.. ఇలా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా, ఇంద్రానీ తండ్రే.. షీనా తండ్రి అని తెలుస్తోంది. అంటే, ఇంద్రానీ తాను తండ్రిగా చెబుతోన్న ఉపేంద్రతో చిన్నప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇంద్రానీ 2001లో సెక్స్ రాకెట్లో పట్టుబడింది. అనంతరం బెయిల్ పైన విడుదలయింది. షీనా హత్య జరిగిన తర్వాత ఆమె అమెరికాలో ఉందని ఇంద్రానీ అందర్నీ నమ్మించింది. అంతేకాదు, ఆమె జీవించి ఉందని చెప్పేందుకు షీనా సోషల్ మీడియా అకౌంట్లను రన్ చేశారు.

English summary
The Sheena Bora murder mystery is gradually taking shape as the driver reveals the plan that day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X