షీనా హత్యలో షాకింగ్ ట్విస్ట్‌లు: గ్యారేజీలో శవం, ఇంద్రాణి తర్వాత టార్గెట్ కొడుకు
ముంబై: కూతురు షీనా బోరానీని సోదరిగా, కొడుకు మిఖాయిల్ బోరాను సోదరుడిగా పరిచయం చేసి భర్త పీటర్ ముఖర్జీని పదిహేనేళ్ల పాటు మోసగించిన ఇంద్రాణి.. మూడేళ్ల క్రితం కూతురు షీనాను హత్య చేసింది. ఆమె తదుపరి లక్ష్యం కొడుకు మిఖాయిల్ అని తెలుస్తోంది.
షీనా బోరా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోన్న విషయం తెలిసిందే. ఇంద్రాణీని పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
కూతురు షీనా బోరాను పిలిచినట్లుగానే.. కొడుకు మిఖాయిల్‌ను కూడా ముంబై రావాలని తల్లి ఇంద్రాణి పలుమార్లు కోరింది. ఆయన ముంబైలో అడుగుపెట్టగానే చంపేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆహ్వానించిందని అనుమానిస్తున్నారు.

అప్పటికే తల్లి ప్రవర్తన పైన అనుమానంతో ఉన్న మిఖాయిల్ గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి ఒంటరిగా ఎప్పుడూ బయటకు వెళ్లేవాడిని కాదన్నారు. ఒకవేళ నేను వెళ్లాలనుకుంటే తన స్నేహితులు వెంట వచ్చేవారన్నారు. తాను రిస్క్ తీసుకోలదల్చుకోలేదన్నారు.
ముంబై పోలీసులు తనను ప్రశ్నించాలనుకుంటే గౌహతికి రావాలని, తాను మాత్రం ముంబైకి వెళ్లనని చెప్పారు. తన అమ్మమ్మ, తాతయ్యలను ఒంటరిగా వదిలి వెళ్లలేనన్నారు.
ఆ రోజు రాత్రి పీటర్ ముఖర్జీ గ్యారేజీలోనే మృతదేహం
మూడేళ్ల క్రితం షీనా బోరాను ఇంద్రాణి హత్య చేసిన అనంతరం ఆ కారులోనే షీనా మృతదేహాన్ని ఉంచి, తన భర్త పీటర్ ముఖర్జీ గ్యారేజీలో పెట్టిందని తెలుస్తోంది. ఆ రోజు రాత్రి మొత్తం గ్యారేజీలోనే ఉంచింది. ఆ తర్వాత రోజు గుట్టుచప్పుడు కాకుండా అడవిలో పాతిపెట్టింది. ఎవరు గుర్తించకుండా శవాన్ని కాల్చివేశారు.












Click it and Unblock the Notifications