తల్లి సన్నిహితుడితో షీనా సీక్రెట్ ట్రిప్? కూతురుకాదు!

ముంబై: షీనా బోరా హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. హత్యకు గురైన షీనా గర్భవతి అని తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గర్భం ధరించడం వల్ల ఎక్కడ తన పరువు పోతుందని భయపడిన ఇంద్రానీ ఆమెను హత్య చేయించినట్లు అనుమానిస్తున్నారు.

హత్య చేయబడటానికి ముందు షీనా బోరా... తను గర్భవతినని, ఇంద్రానీకి బాగా సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు షీనాకు ఇంద్రానీ భర్త అయిన పీటర్ కుమారుడు రాహుల్ ముఖర్జియాతో సంబంధం ఉంది. వారిరువురు పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్న సమయంలో షీనా హత్య గావింపబడిందని తెలుస్తోంది. ఈ హత్య వ్యవహారం రాహుల్, పీటర్‌లకు తెలియనివ్వకుండా ఇంద్రాణి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

షీనా బోరా తన తల్లి ఇంద్రానీకి చాలా సన్నిహితంగా ఉండే సంబంధీకుల వల్ల గర్భం ధరించినట్లుగా చెబుతున్నారు. ఇది హత్యకు దారి తీయవచ్చుని అంటున్నారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంద్రానికి చాలా చాలా క్లోజ్‌గా ఉండే వ్యక్తితో షీనా థాయిలాండ్ ట్రిప్‌కు కూడా వెళ్లిందని తెలుస్తోంది.

అయితే, ఆ వ్యక్తికి షీనా, ఇంద్రానీల మధ్య ఉన్న సంబంధం తెలియకపోవచ్చునని చెబుతున్నారు. మరోవైపు, ఎప్పుడైతే తన కూతురు షీనా, మూడో భర్త పీటర్ ముఖర్జీయా కొడుకు రాహుల్‌తో సంబంధం ఉందని తెలిసిన తర్వాత... షీనాకు తనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇంద్రానీ వెల్లడించవలసి వచ్చిందని తెలుస్తోంది.

Sheena was my grand daughter, says Indrani Mukherjea's father

షీనా బోరాతో చివరి మాటలు అవే: ప్రియుడు

షీనా బోరా హత్య కేసులో పోలీసులు ఆమె ప్రియుడు రాహుల్‌ను విచారించారు. ఈ హత్య గురించి తనకు తెలియదని, షీనా బోరా నుంచి చివరిసారి బ్రేకప్ మెసేజ్ వచ్చిందని చెప్పాడు. షీనా గురించి అడిగిన ప్రతిసారీ ఆమె వెంటపడడం మానుకోవాలని ఇంద్రానీ సలహా ఇచ్చేదని రాహుల్ ముఖర్జియా తెలిపాడు.

2012 ఏప్రిల్ 24న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతో కలిసి వెళ్లడానికి కొన్ని గంటల ముందు, ఆమెతో మాట్లాడడమే చివరిసారన్నాడు.

Sheena was my grand daughter, says Indrani Mukherjea's father

షీనా బోరా నా మనవరాలు

షీనా బోరా తన మనవరాలు అని ఇంద్రాని తండ్రి ఉపేంద్ర కుమార్ బోరా చెప్పారు. ఇంద్రానీ తన కూతురు షీనా బోరాను తన మూడో భర్తకు సోదరిగా పరిచయం చేయడమే గందరగోళానికి దారి తీసిందని చెప్పవచ్చు. షీనా తన మనవరాలు అని అతను తన ఇంటిలోని బాల్కనీ నుంచి గట్టిగా చెప్పారు. షీనా తండ్రి ఎక్కడ అని అడగగా.. అది తెలియాల్సి ఉందని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+