రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు: షీలాదీక్షిత్ యూటర్న్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లవాడేనంటూ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఒక్కరోజులోనే యూటర్న్ తీసుకున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లవాడేనంటూ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ యూటర్న్ తీసుకున్నారు. పరిణితి కల నాయకుడి సున్నితత్వాన్ని ఆయన కలిగి ఉన్నారని తాను చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు.
ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి 46 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా పరిపక్వత రాలేదని షీలాదీక్షిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే కామెంట్లు చేయడం ప్రారంభించింది.

పరిపక్వత చెందని రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ కు పంపించే బదులు ఇంట్లోనే ఉంచుకోవాలంటూ బీజేపీ విమర్శించిన నేపథ్యంలో షీలాదీక్షిత్ తన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ వ్యంగ్య కామెంట్లను తిప్పికొడుతూ.. 'రాహుల్ చాలా సున్నితమైన వ్యక్తి అని, ఓ పరిణితి కల నాయకుడి ఆందోళన తనకు రాహుల్ లో కనిపించిందని తాను వ్యాఖ్యానించినట్లు ఆమె వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications