ఫ్రెండ్ భార్యపై రేప్, బీజేపీ మాజీ మంత్రికి క్లీన్ చిట్, ఇద్దరి ఇష్టంతోనే సెక్స్ !

స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి (బీజేపీ) హరతాళ్ హాలప్పకు శివమొగ్గ 2వ జేఎంఎఫ్ సీ న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది.

బెంగళూరు: స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి (బీజేపీ) హరతాళ్ హాలప్పకు శివమొగ్గ 2వ జేఎంఎఫ్ సీ న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. స్నేహితుడి భార్య మీద హరతాళ్ హాలప్ప అత్యాచారం చేసినట్లు సరైన సాక్షాదారాలు లేవని న్యాయమూర్తి బి.జి. రమాదేవి చెప్పారు.

2009 నవంబర్ 27వ తేదీ రాత్రి తన స్నేహితుడు వెంకటేష్ మూర్తి భార్య చంద్రావతి మీద అత్యాచారం చేశారని హరతాళ్ హాలప్ప మీద కేసు నమోదు అయ్యింది. అప్పట్లో హరతాళ్ హాలప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.

Shimoga court gives clean chit to former minister Hartal Halappa

హైదరాబాద్ లోని ల్యాబ్ లో రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరూ ఇష్ట ప్రకారం సెక్స్ లో పాల్గొన్నారని సీఐడీ అధికారులు నివేదిక తయారు చేసి కోర్టులో సమర్పించారు. ఈనెల 10వ తేదీన కేసు తుది విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టింది. ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడు సంవత్సరాల తరువాత హరతాళ్ హాలప్ప నిర్దోషిగా బయటకు రావడంతో ఆయను అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+