ఏక్‌నాథ్ షిండే సర్కార్‌కు డెత్ వారెంట్ జారీ
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన సొంత వర్గంలో తిరుగుబాటును ఎదుర్కొంటోన్నారా?.. ఇదివరకు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన షిండే తరహాలోనే ఇప్పుడు మరో నాయకుడు ఈ బాటలో సాగుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది మహారాష్ట్ర రాజకీయాల్లో. దీనికి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన రెబెల్- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా షిండే క్యాంప్‌లో తిరుగుబాటు మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లు దీనికి కారణం అని చెబుతున్నారు. 16 మంది రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని ఇస్తోన్నాయి. మరో 15-20 రోజుల్లో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే డెత్ వారంట్ కూడా జారీ అయ్యిందని, తేదీ ఒక్కటే పెండింగ్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ డెత్ వారెంట్‌పై ఎవరు సంతకం చేస్తారనేది తేలాల్సి ఉందని చెప్పారు.

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ.. జాప్యం జరిగిందని, ఫలితంగా- షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం ఇంకా మనుగడ కొనసాగిస్తోందని చెప్పారు.
ప్రస్తుత శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం 15-20 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని సంజయ రౌత్ తేల్చి చెప్పారు. గత ఏడాది జూన్‌లో 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు ఏక్‌నాథ్ షిండే సారథ్యాన్ని వహించారు. మైనారిటీలో పడిన ఉద్ధవ్ థాకరే కుప్పకూలింది. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. షిండే- బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications