నరేంద్ర మోడీ గత రికార్డులన్నీ బద్దలు కొట్టారు కానీ, ఉపయోగం లేదు: శివసేన
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ అత్యధికసార్లు విదేశాల్లో పర్యటించి గత రికార్డులు బద్దలు కొట్టారని, కానీ దాని వల్ల దేశానికి ఏ ప్రయోజనం చేకూరిందని శివసేన ప్రశ్నించింది. ఫ్రాన్స్, రష్యాలతో భారత్ యుద్ద విమానాల ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో తమ దేశ ఎఫ్ 16 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవాలని, లేదంటే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోందన్నారు.
విష్ణుమూర్తి మళ్లీ తన రూపంలో జన్మించినట్లు ప్రధాని మోడీ ప్రపంచం మొత్తం పర్యటిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారని ఎద్దేవా చేసింది. కొన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు లేవని, ఆయా దేశాలతో బంధాన్ని బలపర్చడానికే మోడీ పర్యటనలు చేస్తున్నట్లున్నారని పేర్కొంది. కానీ ఆయన పర్యటన వల్ల కోట్లాది రూపాయలు ఖర్చవుతోందని పేర్కొంది.
డబ్బు ఖర్చయినప్పటికీ భారత్‌కు మాత్రం ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని అన్నారు. తొలుత ఫ్రాన్సుతో కేంద్రం రఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు ఒప్పందం చేసుకుందని, దీనిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంది. రష్యాతో ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై అమెరికా అభ్యంతరాలు చెబుతోందన్నారు.

భారత్-పాక్‌ల మధ్య శాంతి ఉండాలని ఆర్థికాభివృద్ధి సాధించిన ఏ దేశమూ కూడా కోరుకోవడం లేదని పేర్కొంది. ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, ఈజిప్ట్, అఫ్గానిస్థాన్‌తో పాటు పాకిస్తాన్, భారత్‌లలో అస్థిర పరిస్థితులు ఉండాలనే అవి కోరుకుంటాయని తెలిపింది.
కనీసం భారత్ పొరుగున ఉన్న దేశాలు కూడా మన దేశంతో నిజంగా స్నేహం కోరుకోవడం లేదని తెలిపింది. నేపాల్ హిందూ దేశం అయినప్పటికీ చైనా, పాకిస్తాన్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, మోడీ విదేశీ యాత్రల కోసం చేస్తున్న ఖర్చు వల్ల దేశానికి ఏ ప్రయోజనం చేకూరిందో చెప్పాలని ప్రశ్నించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications