బీజేపీకి చురకలు అంటించిన శివసేన

ముంబై: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన బీజేపీకి మిత్రపక్షం అయిన శివసేన ఘాటుగా విమర్శించింది. అబద్దాలు చెబుతూ ఎల్లప్పుడూ ప్రజలను మోసం చెయ్యడం సాధ్యం కాదని పరోక్షంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు చురకలు అంటించింది.

శివసేనకు చెందిన సామ్నాలో బీహార్ ఎన్నికల తరువాత మళ్లి బీజేపీ మీద మండిపడింది. ప్రతినిత్యం ప్రజలను మోసం చెయ్యడం రాజకీయాలలో పనిచెయ్యవని గుర్తు చేసింది. ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారని గుర్తు చేసింది.

Shiv Sena comments, Bihar legislative assembly election- 2015

తరువాత ప్రజలు సరైన సమయంలో రాజకీయ నాయకులకు గట్టి బుద్ది చెబుతారని హెచ్చరించింది. సముద్రం నుంచి అలలు వస్తుంటాయి పోతుంటాయని గుర్తు చేసింది. అలలు వెళ్లిపోయాక వాటి అనవాళ్లు సైతం కనిపించకుండా పోతాయని చెప్పింది.

బీహార్ సాధారణ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి కూడా అలాంటిదే అని ఎద్దేవా చేసింది. మహారాష్ట్ర గురించి కాకూండా శివసేన వేరే రాష్ట్రం గురించి పెద్దగా ఆసక్తి చూపించదని ఇదే సమయంలో స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు నిద్రలేవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+