రేప్ కేసులో శివసేన నేత అరెస్టు: బాలిక ప్రసవం

వివరాల్లోకి వెళ్తే .... శివసేన జిల్లా డిప్యూటీ చీఫ్ వాసుదేవ్ నంబియార్‌కు థానేలోని కాశ్మీరా టౌన్‌షిప్‌లో ఓ ఆలయంతో పాటు పాఠశాల ఉంది. వాసుదేవ్ నంబియార్‌ను శుక్రవారంనాడు అరెస్టు చేసినట్లు కాశ్మీరా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కదం చెప్పారు.
నిందితుడు నడుపుతున్న పాఠశాలలో బాధితారులు తొమ్మిదో తరగతి చదివింది. ఆలయానికంటూ బాలికను అతను తన వెంట పలుమార్లు తీసుకుని వెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరిలో థానే జిల్లాలోని మీరా గ్రామంలో పదే పదే ఆమెపై అత్యాచారం చేశాడు.
విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని నిందితుడు బాలికను హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే బాలిక గర్భం దాల్చి ఈ వారంలో నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చిందని పోలీసులు చెప్పారు. ప్రసవం కావడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారాన్ని అందించాయి.
దాంతో పోలీసులు గురువారంనాడు నంబియార్‌పై కేసు నమోదు చేసి శుక్రవారంనాడు అతన్ని అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications