వీడు మామూలోడు కాదు, పెద్ద తోపు, ఒకేసారి 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు లూటీ !

బెంగళూరు: కొంత మంది పోలీసులు అమాయకులకు మస్కా కొడుతుంటే ఓ కిలాడీ తోపుగాడు ఏకంగా 23 మంది పోలీసులకు సినిమా చూపించాడు. ఏకంగా ఒకే సారి 23 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్ మొబైల్ ఫోన్లు చోరీ చేసి పోలీసులకు చుక్కలు చూపించాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు వీడు మామూలోడు కాదు, పెద్ద కేటుగాడు అంటున్నారు.

తమిళ తంబి అతి తెలివి

తమిళ తంబి అతి తెలివి

తమిళనాడుకు చెందిన కార్తీక్ (34) అనే వ్యక్తిని అరెస్టు చేసిన శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులు 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 10 విలువైన మొబైల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు కార్తీక్ ఎలా ఒకే సారి చోరీ చేశాడు అనే విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ కు గురైనారు.

 హింధూ మహాసభ

హింధూ మహాసభ

2019 సెప్టెంబర్ 12వ తేదీన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో హింధూ మహాసభా నిర్వహకులు పెద్ద ఎత్తున వినాయక చవితి పండుగ నిర్వహించారు. అదే సమయంలో హింధూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

 లక్షల మంది భక్తులు

లక్షల మంది భక్తులు

లక్షలాధి మంది భక్తులు పాల్గొన్న వినాయక నిమజ్జనం ఊరేగింపుకు అదనపు పోలీసు బలగాలను భద్రత కోసం నియమించారు. ఆ సమయంలో భద్రతా ఏర్పాటు చెయ్యడానికి వెళ్లిన పోలీసులు శివమొగ్గలోని కళ్యాణమండపంలోని సముధాయ భవనంలో బస చేశారు.

లగేజ్, మొబైల్ ఫోన్లు

లగేజ్, మొబైల్ ఫోన్లు

సముధాయ భవనంలో పోలీసులు వారి లగేజ్ తో పాటు విలువైన మొబైల్ ఫోన్లు అక్కడే పెట్టి వినాయక నిమజ్జనం భద్రతా ఏర్పాట్లకు వెళ్లారు. వినాయక నిమజ్జనం పూర్తి అయిన తరువాత మరుసటి రోజు వేకువ జామున 2 గంటల సమయంలో పోలీసులు కళ్యాణమండపంలోని సముధాయ భవనం చేరుకున్నారు.

 పోలీసులకే సవాల్

పోలీసులకే సవాల్

సముధాయ భవనంలోని లగేజ్ తోపాటు అక్కడ ఉన్న 23 విలువైన మొబైల్ ఫోన్లో చోరీ అయిన విషయం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. ఒక్క సారిగా 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు చోరీ కావడంతో పోలీసు శాఖ ఈ కేసును సవాలుగా స్వీకరించారు. అనేక మంది పోలీసుల విలువైన మొబైల్ ఫోన్ల లోకేషన్స్ పై నిఘా వేశారు.

తమిళనాడులో జల్సాలు

తమిళనాడులో జల్సాలు

తమిళనాడులో తలదాచుకుని జల్సాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కార్తీక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతను తెలిపిన వివరాల ఆధారంగా 13 విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్తీక్ మిగిలిన 10 మొబైల్ ఫోన్లు ఏం చేశాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+