వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదైనా నేనే చెబుతా: పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్. ప్రస్తుతం సినిమాలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్. ప్రస్తుతం సినిమాలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. శుక్రవారం హాసన్ నగరంలో కళ్యాణ్ జువెలరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

నిజం లేదు

నిజం లేదు

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని, అన్ని వదంతులేనని శివ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. అలాంటిదేమైనా ఉంటే తానే మొదట మీడియాకు చెబుతానని తెలిపారు.

రాహుల్ రాకలో రాజకీయం లేదు

రాహుల్ రాకలో రాజకీయం లేదు

ప్రస్తుతం తాను కళ్యాణ్ జువెల్లరీకి ప్రచారకర్తగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి మృతి చెందిన సందర్భంగా తమను పరామర్శించడానికి వచ్చారని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ చర్చకు తావు లేదని శివ రాజ్ కుమార్ తేల్చి చెప్పారు.

శివ రాజ్‌కుమార్ వివరణతో..

శివ రాజ్‌కుమార్ వివరణతో..

శివ రాజ్‌కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిసిన నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తన రాజకీయ ప్రవేశంపై శివరాజ్ కుమార్ స్పష్టతనిచ్చారు.

ఇటీవల తల్లి మరణం..

ఇటీవల తల్లి మరణం..

సూపర్ స్టార్, డా. రాజ్‌కుమార్ సతీమణి, శివ రాజ్‌కుమార్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్(77) మే31న తెల్లవారుజామున 4.40గంటలకు కన్నుమూశారు. అనారోగ్య కారణంగా బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ కన్నుమూత, ఆమె ప్రస్థానంసూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ కన్నుమూత, ఆమె ప్రస్థానం

English summary
Kannada Superstar Shiva Rajkumar on Friday responded on his political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X