Shock: రూ. 10 సిగరేట్ కోసం ప్రాణం తీసిన యువకులు, బ్యాగ్ లో ఎంత ఉందంటే ?, సైకో ఫ్రెండ్స్ !

న్యూఢిల్లీ: చిన్నచిన్న విషయాలకు హత్యలు జరగడం సర్వసాధారం అయిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు ఏరకంగా గాలిలో కలిసిపోతాయో చెప్పడం సాధ్యం కావడం లేదు. సాటి స్నేహితులతో కలిసి ఆడుకునే వయసులో ఓ మైనర్ అబ్బాయి సిగరేట్ కు డబ్బులు ఇవ్వలేదని అతన్ని దారుణంగా చంపేశారు.

దేశరాజధానిలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా చంపేశారు. సెంట్రల్ డిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో విజయ్ (17) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉదయం డబ్బులు బ్యాగ్ లో పెట్టుకున్న విజయ్ సరుకులు తీసుకురావడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఆ సందర్బంలో విజయ్ నడుచుకుంటూ వెలుతున్న విషయం అతనికి పరిచయం టైలర్ సోనూ కుమార్ అనే యువకుడు చూశాడు.

 Shock: 17 year old killed in Anand Parbat over refusal to give Rs10 for a cigarette, 4 arrested in Delhi.

సోనూ కుమార్ (24) తో పాటు అతని పక్కన ప్రవీణ్ కుమార్ (24), అజయ్ ఆశా (23), జతిన్ అలియాస్ ధంచా (24) అనే యువకుడు ఉన్నారు. విజయ్ ని పిలిచిన సోనూ కుమార్ రూ. 10 ఇచ్చి సిగరేట్ ఒక్కటి తీసుకుని వచ్చి మాకు ఇవ్వాలని, లేదంటే రూ. 10 డబ్బులు ఇవ్వాలని విజయ్ కి చెప్పారు. సిగరేట్ తీసుకువెళ్లి ఇవ్వడానికి నిరాకరించి విజయ్ వాళ్లకు రూ. 10 ఇవ్వనని తేల్చి చెప్పాడు. ఆ సమయంలో విజయ్, సోనూ కుమార్, అతని ఫ్రెండ్స్ మద్య వాగ్వివాదం జరిగింది.

ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన సోనూ కుమార్, అతని ఫ్రెండ్స్ కత్తులతో విజయ్ ని చంపేసి అతని దగ్గర ఉన్ బ్యాగ్ లాక్కొని పరారైనారు. హత్యకు గురైన విజయ్ బ్యాగ్ లో రూ. 150 ఉందని అతని కుటుంబ సభ్యులు చెప్పారి పోలీసులు అన్నారు. సిగరేట్ తీసివ్వడానికి నిరాకరించిన 17 ఏళ్ల అబ్బాయి విజయ్ హత్యకు గురికావడం సెంట్రల్ ఢిల్లీలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+