Shock: బ్రదర్స్ లిక్కర్ పార్టీలు, తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్టు, మరదలి దెబ్బ !
బెంగళూరు: సొంత అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కలసిమెలసి ఉంటున్నారు. అన్నా, తమ్ముడు ఇద్దరూ వేర్వేరు మహిళలను పెళ్లి చేసుకుని వారివారి భార్యలు, పిల్లలతో కలిసి ఒకే ఏరియాలో నివాసం ఉంటున్నారు. 50 సంవత్సరాలు కలసిమెలసి జీవించిన అన్నాతమ్ముడు చాలా అన్యోన్యంగా జీవించారని అందరూ అంటున్నారు. అయితే అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురైనాడని మరదలు కేసు పెట్టడం, పోలీసులు అన్నను జైలుకు పంపించడం కలకలం రేపింది.

50 ఏళ్లు సంతోషంగా ఉంటున్న అన్నాతమ్ముడు
బెంగళూరులోని గోవిందపురలో కపిలన్ (51), అశోకన్ (54) అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అశోకన్, కపిలన్ వేర్వేరు మహిళలను పెళ్లి చేసుకుని వారివారి భార్యలు, పిల్లలతో కలిసి బెంగళూరు నగరంలోని గోవిందపురం ఏరియాలోనే నివాసం ఉంటున్నారు. 50 సంవత్సరాలు కపిలన్, అశోకన్ ఎలాంటి గొడవలు లేకుండా కలసిమెలసి జీవిస్తున్నారు.

బార్ లో మద్యం సేవించారు
కపిలన్, అశోకన్ ఇద్దరూ పెయింట్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 6వ తేదీ సోమవారం రాత్రి అశోకన్, అతని తమ్ముడు కపిలన్ ఒకేబార్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. బార్ లో మద్యం సేవించిన తరువాత అశోకన్, కపిలన్ బార్ లో నుంచి బయటకు వచ్చారు. బార్ ముందే కపిలన్ కుప్పకూలిపోయాడు.

తమ్ముడి భార్య ఎంట్రీతో సీన్ రివర్స్
కపిలన్ ను వెంటనే నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కపిలన్ చనిపోయాడని పోలీసులు అన్నారు. మద్యం మత్తులో కపిలన్ కాలుజారి కిందపడి చనిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే కపిలన్ చనిపోయిన మరుసటి రోజు అతని భార్య పుష్పరాణి గోవిందపురం పోలీస్ స్టేషన్ చేరుకుని ఆమె బావ అశోకన్ మీద హత్య కేసు పెట్టడం కలకలం రేపింది.

ఆస్తి కోసం బావ హత్య చేశాడు
అందరూ అనుకున్నట్లు తన భర్త కపిలన్, తన బావ అశోకన్ అన్యోన్యంగా లేరని, ఇద్దరి మద్య ఇంటి స్థలం విషయంలో గొడవలు పడుతున్నారని పుష్పారాణి పోలీసులకు చెప్పింది. తన భర్త కపిలన్ ను తన బావ అశోకన్ హత్య చేశాడని పుష్పారాణి కేసు పెట్టడంతో వాళ్ల బంధువులు హడలిపోయారు. పోలీసులు అశోకన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల విచారణలో అశోకన్ అతని తమ్ముడు కపిలన్ ను హత్య చేశాడా ? లేదా ? అని వెలుగు చూడనుంది.












Click it and Unblock the Notifications