అంబానీకి షాక్.. ఫ్రాడ్ ముద్ర వేసిన ఎస్బీఐ!

భారతదేశంలో ఒకప్పుడు తనదైన ముద్ర వేసుకున్న పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అనీల్ ధీరుభాయి అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కి ఊహించని షాక్ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ ని ఫ్రాడ్ గా ఎస్బిఐ జూన్ 13వ తేదీన గుర్తించినట్టు లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది.

అనిల్ అంబానీకి ఊహించని షాక్

ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడిగా ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీ, ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఒకానొక సందర్భంలో తను ఆర్థికంగా దిగజారి పోయానని ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి. తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కి చేరుకుందని కోర్టుకు చెప్పుకున్న దుస్థితి. అయితే ఇటీవల తిరిగి ఆయన వ్యాపారాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఈ సమయంలో తాజాగా మరోమారు ఆయనకు ఊహించని దెబ్బ తగిలింది.

Shock For Ambani Anil Ambani And Reliance Communications Reclassified As Fraud By SBI

Take a Poll

అనిల్ అంబానీ, ఆర్ కాం ఫ్రాడ్ అన్న ఎస్బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బిఐ నుండి అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కోసం రుణం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఎస్బిఐ అనిల్ అంబానీ కి సంబంధించిన రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థను, అనిల్ అంబానీ ని మోసపూరితమైన విగా ప్రకటించింది. ఈ విషయం పైన కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అవుతోంది.

ఆర్బీఐ విధానాల మేరకే ఈ నిర్ణయం

ఇక ఇదే విషయాన్ని నేడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2025 జూన్ 13వ తేదీన ఆర్ కాం మరియు అనిల్ అంబానీ లను ఫ్రాడ్ గా ప్రకటించింది ఎస్బిఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ నిబంధనలు, అలానే బ్యాంకు బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బిఐ పేర్కొంది.

2227.64కోట్ల రుణం తీసుకున్న ఆర్ కాం

ఇక ఈ విషయాన్ని జూన్ 24వ తేదీన ఆర్బిఐ కు తెలియజేయడంతో పాటు, జూలై 1న స్టాక్ ఎక్స్చేంజ్ కి కూడా సమాచారం అందించారు. 2227.64కోట్ల రుణం రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు ఇచ్చిన ఎస్బిఐ దీనికి 2016ఆగస్టు 26నుంచి వడ్డీ ఇతర ఖర్చులు, అదనంగా 786.52కోట్ల బ్యాంకు గ్యారంటీ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము చెల్లించకుండా దివాలా కోడ్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కు వెళ్లారు.

గతంలో కూడా అనిల్ అంబానీ, ఆర్ కాంల ఫ్రాడ్ వర్గీకరణ

అయితే గతంలోనే ఎస్బిఐ దీనిని ఫ్రాడ్ గా పరిగణించి 2021 జనవరి 5న సిబిఐకి ఫిర్యాదు చేసింది. తర్వాత రోజు ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వడంతో, సిబీఐ ఆ ఫిర్యాదును వెనక్కు పంపింది. 2023 మార్చి 27వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బిఐ ఫ్రాడ్ వర్గీకరణను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది.

ఆర్ కాం నుండి వివిధ గ్రూపులకు నిధుల బదిలీ

మళ్లీ 2024 జూలై 15న జారీ చేసిన ఆర్బిఐ కొత్త నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను అనుసరించి పరిశీలించి ఆర్ కాం అనిల్ అంబానీ లను తిరిగి ఫ్రాడ్ గా వర్గీకరించింది. అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా ఆ నిధులను వివిధ గ్రూపు సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఆర్ కాం కు తెలియజేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఫ్రాడ్ గా పేర్కొంటూ సిబిఐ కు ఫిర్యాదు చేయడానికి రెడీ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+