వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్ ప్లాన్ బూమ్ రాంగ్ : కొనసాగుతారా - క్లోజ్ చేస్తారా..!!

|
Google Oneindia TeluguNews

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు తాజా రాజకీయాలు అంతు చిక్కటం లేదు. కొత్త లక్ష్యంతో అడుగులు వేస్తున్న ప్రశాంత్ కిషోర్ అంచనాలు తల కిందులయ్యాయి. దీంతో..ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి రావటానికి రాజకీయంగా సహకారం అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన భవిష్యత్ పైన ఆలోచనలో పడ్డారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్ లో రాజకీయ యాత్ర ప్రారంభించారు.

పీకే కు ఊహించని పరిణామం

పీకే కు ఊహించని పరిణామం

బిహార్​లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జన సురాజ్ పేరిటసరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారుం చట్టారు. గాంధీ జయంతి నాడు తన పాదయాత్ర ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. చెప్పన దాని ప్రకారం పశ్చిమ చంపారణ్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది.

అక్కడ బహిరంగ సభకు పీకే టీం ఏర్పాట్లు చేసింది. కానీ, ప్రశాంత్ కిషోర్ సభకు జనస్పందన లేదు. అసలు జనం అటు సభ వైపే చూడలేదు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. సభా ప్రాంగణమంతా ఖాళీగా కనిపించింది. గాంధీజీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి పీకే తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు.

నాడు క్రెడిట్..నేడు బూమ్ రాంగ్

నాడు క్రెడిట్..నేడు బూమ్ రాంగ్

కొంత మంది సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నా.. వారు కూడా అక్కడ ఉన్న గాంధ్రీ ఆశ్రమం చూడటం కోసం వచ్చిన వారుగా చెప్పటంతో పీకే టీం ఖంగుతింది. దాదాపుగా 12 నుంచి 18 నెలల పాటు యాత్ర కొనసాగేలా పీకే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడా విరామం లేకుండా ప్రతీ గ్రామానికి వెళ్లాలని రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ యాత్ర వెనుక తన లక్ష్యాలను పీకే స్పష్టం చేసారు. తన జన్ సురాజ్ ద్వారా వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల ఆలోచనలకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో యాత్ర సాగుతుందని​ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో ఐప్యాక్ వ్యవస్థాపకుడిగా అనేక పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారనే క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ దక్కించుకున్నారు.

పీకే అడుగులు ఎటు

పీకే అడుగులు ఎటు

కానీ, ఇప్పుడు ఐ ప్యాక్ నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించనని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇప్పుడు ప్రారంభించిన యాత్రకు వస్తున్న స్పందన చూసిన తరువాత ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మరి కొద్ది రోజులు యాత్ర కొనసాగించి ఆ తరువాత నిర్ణయం తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు పీకే యాత్రకు వచ్చిన స్పందన పైన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Shocking situation for Prasanth Kishor Jana Suraj Yatra in Bihar, no response from public for First day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X