చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Justice: నాటుకోళ్లు, కోడిపిల్లలకు విషం పెట్టి చంపేశారని కేసు పెట్టిన తండ్రి, కూతురు, అసలు మ్యాటర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కడలూరు: వ్యవసాయం చేయిస్తున్న వ్యక్తి ఇంటి దగ్గర నాటుకోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవులు పెంచుకుంటున్నాడు. మంచిమంచి జాతి కోళ్లు తెచ్చి వాటిని పెంచి పోషిస్తున్న అతను ఎక్కువగా వాటిమీద శ్రద్ద పెడుతున్నాడు. పొలం దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత ఎక్కువగా కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుతూ వాటిని విక్రయిస్తున్న వ్యక్తి భారీ మొత్తంలోనే డబ్బులు సంపాధిస్తున్నాడు. పందెం కోళ్లు తెచ్చిన అతను కొన్ని కోళ్లు కోడి పిల్లలు పుట్టేలా పుంజులను వాటి మీదకు వదిలాడు. పెట్టకోళ్లు చాలానే గుండ్లు పెట్టాయి. కోడిగుడ్లు జాగ్రత్తగా పెట్టిన అతను వాటిని పొదిగించాడు. చాలా పిల్లలు పుట్టడంతో పొలం దగ్గరకు కూడా వెళ్లకుండా వాటిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రైతు కూతురు కూడా ప్రాణానికి ప్రాణంగా కోళ్లను చూసుకుంటున్నది. రెండు రోజుల క్రితం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అతను తన తల్లి కోళ్లకు, వాటి పిల్లలకు విషం పెట్టి చంపేశారని, వాటిని హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు.

Illegal affair: పనోడితో కౌన్సిలర్ భార్య ?, స్లోపాయిజన్, సాంబార్ స్కెచ్, డౌట్ రాకుండా, ఫినిష్ !Illegal affair: పనోడితో కౌన్సిలర్ భార్య ?, స్లోపాయిజన్, సాంబార్ స్కెచ్, డౌట్ రాకుండా, ఫినిష్ !

కోళ్లు, పశులు అంటే ప్రాణం

కోళ్లు, పశులు అంటే ప్రాణం

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుదాచలం సమీపంలోని ఎరుమనూరు గ్రాయంలో కదిరరామన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న కదిరరామన్ అతని ఇంటి దగ్గర నాటుకోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవులు పెంచుకుంటున్నాడు. మంచిమంచి జాతి కోళ్లు తెచ్చి వాటిని పెంచి పోషిస్తున్న కదిరరామన్ ఎక్కువగా వాటిమీద శ్రద్ద పెడుతున్నాడు. రైతు కూతురు కూడా ప్రాణానికి ప్రాణంగా కోళ్లను చూసుకుంటున్నది.

పందెం కోళ్లు తెచ్చుకున్నాడు

పందెం కోళ్లు తెచ్చుకున్నాడు

పొలం దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత కదిరరామన్ ఎక్కువగా కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుతూ వాటిని విక్రయిస్తున్నాడు. పందెం కోళ్లు, జాతి కోళ్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్న కదిరరామన్ భారీ మొత్తంలోనే డబ్బులు సంపాధిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వేరే జిల్లా నుంచి పందెం కోళ్లు తెచ్చిన కదిరరామన్ కొన్ని కోళ్లు కోడి పిల్లలు పుట్టేలా పుంజులను వాటి మీదకు వదిలాడు.

ఉదయం చూస్తే అన్ని కోళ్లు చచ్చిపోయాయి

ఉదయం చూస్తే అన్ని కోళ్లు చచ్చిపోయాయి

పెట్టకోళ్లు చాలానే గుండ్లు పెట్టాయి. కోడిగుడ్లు జాగ్రత్తగా పెట్టిన కదిరరామన్ వాటిని పొదిగించాడు. ఒక్కొక్క కోడికి 10కి పైగా పిల్లలు పు్టాయి. చాలా కోడి పిల్లలు పుట్టడంతో కదిరరామన్ పొలం దగ్గరకు కూడా వెళ్లకుండా వాటిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. కదిరరామన్ కూతురికి కోళ్లు అంటే ప్రాణం. కదిరరామన్ కూతురు కూడా కోళ్లను కంటికి రెప్పలా కాపాడుతోంది. రెండు రోజుల క్రితం రాత్రి కోళ్లకు గింజలు ఆహారంగా వేసిన కదిరరామన్ నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచి చూడగా కోళ్లతో పాటు కోడి పిల్లలు అన్ని చనిపోయి ఉండటంతో కదిరరామన్ హడలిపోయాడు.

Recommended Video

సింగరేణి బాలిక రేప్ ఘటనపై స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
కోళ్లు చంపేశారని కేసు పెట్టిన రైతు

కోళ్లు చంపేశారని కేసు పెట్టిన రైతు


కోళ్లు, కోడి పిల్లలు అన్ని చనిపోవడంతో కదిరరామన్ రగిలిపోయాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న వాళ్లకు తాను కోళ్లు పెంచి డబ్బులు సంపాధించడం ఇష్టం లేదని, వాళ్లు చంపేసి ఉంటారని రగిలిపోయాడు. కూతురితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కదిరరామన్ మా ఇంట్లో ఉన్న తల్లి కోళ్లకు, వాటి పిల్లలకు పక్కింటి వాళ్లు విషం పెట్టి చంపేశారని, వాటిని హత్య చేసిన వారిని అరెస్టు చెయ్యాలని ఓ బాలిక కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు. కోళ్లను హత్య చేశారని ఓ రైతు కేసు పెట్టడం కడలూరులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Shock: Girl who came to the police station to ask justice for the hen near Cuddalore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X