షాక్: భార్యను గదిలోకి నెట్టి డోర్ లాక్, స్నేహితుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా ధమ్‌పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ తాగుబోతు భర్త భార్యను స్నేహితులున్న గదిలోకి నెట్టి డోర్ లాక్ చేయగా, వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బిజ్నోర్: పీకల వరకు తాగిన ఓ భర్త నీచానికి దిగజారాడు. కట్టుకున్న భార్యను స్నేహితులున్న గదిలోకి నెట్టి డోర్ లాక్ చేశాడు. ఇదే అదనుగా వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవలసిన, ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా ధమ్‌పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఈ అకృత్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆమె భర్తతో పాటు ఈ ఘోరానికి పాల్పడిన నలుగురు స్నేహితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేవలం మద్యం మత్తులో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక ఒక పథకం ప్రకారం ఈ ఆకృత్యానికి ఒడిగాట్టారా? జరిగిన దారుణంలో ఆమె భర్త పాత్ర ఎంతవరకు ఉంది? ఈ విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications