Shock: భార్య హత్య కేసులో భర్తకు 10 ఏళ్లు జైలు శిక్ష, 5 ఏళ్లుగా జైల్లో భర్త, భార్య ప్రత్యక్షం అయ్యింది !
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొంతకాలం దంపతులకు రాజీ చేస్తూ వచ్చిన పెద్దలు, బంధువులు చివరికి చేతులు ఎత్తేశారు. ఎవరు ఎన్ని చెప్పినా దంపతుల మద్య రాజీ కదురలేదు. ఇదే సమయంలో భార్య హత్యకు గురైయ్యిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. భార్య హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. నా భార్యను నేను హత్య చెయ్యలేదని, ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిన తరువాత నేను చూడలేదని భర్త పోలీసులకు చెప్పాడు. భార్యను ఆమె భర్త హత్య చేశాడని పోలీసులు బలమైన సాక్షాలు కోర్టులో సమర్పించారు. కోర్టు భర్తకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే భర్త 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు హత్యకు గురైయ్యిందని పోలీసులు బలమైన సాక్షాలు కోర్టులో సమర్పించిన తరువాత ఆ మహిళ ప్రత్యక్షం కావడం కలకలం రేపిపంది.

దంపతుల మద్య గొడవలు
ఉత్తరప్రదేశ్ లోని బ్రహ్మాచ్ సమీపంలోని జమాపుర లో కంధై అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2006లో కంధై రమాదేవి అలియాస్ రమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కంధైన రమాదేవి దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. రానురాను కంధై, రమాదేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

రాయి టెంకాయిలా తయారైన దంపతులు
కొంతకాలం కంధై, రమాదేవి దంపతులకు రాజీ చేస్తూ వచ్చిన పెద్దలు, బంధువులు చివరికి చేతులు ఎత్తేశారు. రమాదేవి కాని, ఆమె భర్త కంధై కాని ఎవ్వరి మాట వినలేదు. ఎవరు ఎన్ని చెప్పినా కంధై, రమాదేవి దంపతుల మద్య రాజీ కదురలేదు. మీ చావు మీరు చావండి అంటూ బంధువులు, స్థానికులు సైలెంట్ అయిపోయారు.

భార్యను హత్య చేశాడని భర్త మీద కేసు
2009లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమాదేవి మాయం అయ్యింది. రమాదేవి హత్యకు గురైయ్యిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. రమాదేవి హత్య కేసులో ఆమె భర్త కంధైని పోలీసులు అరెస్టు చేశారు. నా భార్య రమాదేవిని నేను హత్య చెయ్యలేదని, ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిన తరువాత ఆమెను నేను చూడలేదని కంధై పోలీసులకు చెప్పాడు.

భర్తకు 10 ఏళ్లు జైలు శిక్ష
భార్య రమాదేవిని ఆమె భర్త కంధై హత్య చేశాడని పోలీసులు బలమైన సాక్షాలు కోర్టులో సమర్పించారు. తరువాత కేసు విచారణ జరిగింది. రమాదేవి హత్య కేసులో ఆమె భర్త కంధైకి స్థానిక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే కంధై 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. రమాదేవి హత్యకు గురైయ్యిందని అందరూ అనుకున్నారు.

ప్రత్యక్షం అయిన పెళ్లామ్
ఇంతకాలం హత్యకు గురైయ్యిందని అనుకున్న రమాదేవి ప్రత్యక్షం కావడంతో అందరూ హడలిపోయారు. రమాదేవి హత్యకు గురైయ్యిందని పోలీసులు బలమైన సాక్షాలు కోర్టులో ఎలా సమర్పించారు అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హత్యకు గురైయ్యింది అనుకున్న భార్య రమాదేవి ప్రత్యక్షం కావడం కలకలం రేపిపంది. భార్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కంధై ఇప్పుడు రమాదేవి ప్రత్యక్షం కావడంతో జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే రమాదేవి ఇంతకాలం ఎక్కడ ఉంది ?, ఏం చేసింది ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications