love marriage:ఇంట్లోనే రివాల్వర్లతో 9 సార్లు కాల్చిపారేశారు, భర్త మృతి, భార్య ?, ఏం జరిగిందంటే!
న్యూఢిల్లీ: పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న యువజంట సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికుల ఆచూకి తెలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు చాలా కాలంగా గాలిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న దంపతుల మీద గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్లతో 9 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ తూటాలు దూసుకోవడంతో భర్త ప్రాణాలు పోయాయి. తీవ్రగాయాలైన భార్య ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

పెళ్లికి నో చెప్పిన పెద్దలు
హర్యానాలోని సోనిపత్ కు చెందిన వినయ్ దాహియా (23) అనే యువకుడు కిరణ్ దాహియా (19) అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలని వినయ్, కిరణ్ బావించారు. పెళ్లి విషయం గురించి ఇద్దరూ వారివారి ఇళ్లలో చెప్పారు. కిరణ్ దాహియా, వినయ్ దాహియాల పెళ్లికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

దేశరాజధానిలో కాపురం
పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఏడాది క్రితం వినయ్, కిరణ్ ఇంటి నుంచి పారిపోయారు. స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్న వినయ్, కిరణ్ ఢిల్లీ చేరుకుని ద్వారాక సెక్టార్ లోని అంబర్ విలేజ్ 23వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అద్దె ఇంటిని తీసుకుని కాపురం చేస్తున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజుల నుంచి కిరణ్, వినయ్ ఎక్కువ బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

ఇద్దర్నీ కాల్చిపారేశారు
రాత్రి 9 గంటల సమయంలో సుమారు 7 మంది వినయ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఎవరో వచ్చారో చూద్దామని వినయ్ తలుపులు తియ్యడంతో నిందితులు దౌర్జన్యంగా ఇంటి లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా రివాల్వర్లు తీసుకుని వినయ్, కిరణ్ మీద కాల్పులు జరిపారు. వినయ్ శరీరంలో నాలుగు బుల్లెట్లు దూసుకుపోవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఐసీయూలో భార్య
భార్య కిరణ్ శరీరంలోకి ఐదు బెల్లెట్లు దూసుకుపోయాయి. అయితే కిరణ్ ప్రాణాలతో బయటపడంతో ఆమెను ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ద్వారాక డివిజన్ డీసీపీ సంతోష్ కుమార్ మీనా చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. వినయ్, కిరణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వారి కుటుంభ సభ్యులు ఇంత దారుణానికి పాల్పడ్డారా ?, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని డీసీపీ సంతోష్ కుమార్ మీనా అంటున్నారు. దేశరాజధాని ఢిల్లీలో నవదంపతుల మీద రివాల్వర్లతో కాల్పులు జరపడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications