family shock: అంత్యక్రియలకు ఏర్పాట్లు, లేచికుర్చున్న హేమావతి, తడిసిపోయింది, డాక్టర్లు !

బెంగళూరు/ మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎవ్వరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ? అనే విషయంలో వైద్యులే గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ సోకిందని అనే భయంతో పాటు అనేక అనుమానాలతో వారి కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారు. ఆసుపత్రిలో శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు ఇక ఎంత చికిత్స చేసినా ఫలితం లేదని, ఇప్పుడే కోమాలో ఉన్న ఆమెకు ఐసీయూలో చికిత్స చేస్తున్నామని, మీరు ఇంటికి తీసుకెళితే డబ్బులైనా మిగులుతాయని వైద్యులు చెప్పారు. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు బంధువులు అందరికి సమాచారం ఇచ్చి హేమావతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె లేచి కుర్చోవడంతో అందరికి కింద పంచెలు తడిసిపోయాయి.

 కరోనా కాదులే మీకేం భయం లేదు

కరోనా కాదులే మీకేం భయం లేదు

కర్ణాటకలోని ఉత్దర కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని సూళ్య తాలుకా మక్ర్కంజ గ్రామంలో నివాసం ఉంటున్న హేమావతి (80) అనే వృద్దురాలు ఇటీవల అనారోగ్యానికి గురైనారు. సూళ్యలోని ఆసుపత్రులతో పాటు అనేక ఆసుపత్రుల్లో హేమావతికి చికిత్స అందించినా ఆమె మాత్రం పూర్తిగా కోలుకోలేదు. హేమావతికి కరోనా వైరస్ సోకలేదని, శ్వాసకోస సమస్యలతో బాధపడుతోందని, మీరు ధైర్యంగా ఉండాలని ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు.

 ఎంతైనా పర్వాలేదు వైద్యం చెయ్యండి డాక్టర్

ఎంతైనా పర్వాలేదు వైద్యం చెయ్యండి డాక్టర్

ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా హేమావతి ఆరోగ్యం కుదటపడకపోవడంతో కుటుంబ సభ్యులు హేమావతిని మంగళూరు సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్ష్లలు చేయించారు. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, హేమావతికి వ్యాధినయం కావాలని ఆమె కుటుంబ సభ్యులు అక్కడి డాక్టర్లను వేడుకున్నారు.

 డబ్బులు ఖర్చు అంతే... మేము ఏమీ చెయ్యలేం

డబ్బులు ఖర్చు అంతే... మేము ఏమీ చెయ్యలేం

హేమావతికి కొన్ని రోజులపాటు ఐసీయూలో ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేశారు. అయితే శ్వాసకోస సంబంధిత వ్యాధితో హేమావతికి వ్యాధి పూర్తిగా ముదిరిపోవడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారని వైద్యులు చెప్పారు. ఎన్నిరోజులు అయినా ఐసీయూలో హేమావతి ఆక్సిజన్ సహాయంతోనే ప్రాణాలు నిలిపుకోవాల్సి ఉందని, అనవసరంగా మీకు డబ్బులు ఖర్చు, ఇంటికి తీసుకెళ్లండి, మేము ఏమీ చెయ్యలేము అంటూ డాక్టర్లు చేతులు ఎత్తేశారు.

 అంత్యక్రియలకు సర్వం సిద్దం

అంత్యక్రియలకు సర్వం సిద్దం

కుటుంబ సభ్యులు సైతం హేమావతిని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. చివరి క్షణాలైనా హేమావతి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెకు ఎంతో ఇష్టమైన సొంత ఇంటిలో ప్రాణాలు వదలడం మనకే మంచిది అని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అంత్యక్రియలకు ఏర్పాటు చెయ్యాలని ఊరిలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు కోమాలో ఉన్న హేమావతిని అంబులెన్స్ లో పిలుచుకుని ఇంటికి బయలుదేరారు.

 అందరికి కింద తడిచిపోయింది

అందరికి కింద తడిచిపోయింది

అంత్యక్రియలకు స్వరం సిద్దం కావడం, హేమావతిని ఇంటికి పిలుచుకుని వెళ్లడం జరిగిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా లేచి కుర్చున్న హేమావతి ఏం జరిగింది ?, ఎందుకు అందరూ ఇక్కడ ఉన్నారు ? అని ప్రశ్నించడంతో అక్కడున్న వారి పంచెలు తడిసిపోయి షాక్ కు గురైనారు. కోమాలో ఉన్న హేమావతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తరువాత కోలుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో మురిసిపోయారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పలేని కుటుంబ సభ్యులు ఏమి లేదులే అంటూ హేమావతికి సర్దిచెప్పారు. మొత్తం మీద వైద్యులే చేతులు ఎత్తేసిన సమయంలో హేమావతి ఎవ్వరూ ఊహించని విధంగా కోలుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హాపీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+