Court: కోర్టులో జడ్జిని కత్తితో పొడిచేశాడు, లాయర్లు చూసి, కోర్టు ఉద్యోగి బరితెగింపు, రూమ్ లో !

చెన్నై/సేలం: క్రిమినల్ కోర్టులో జడ్జిగా ఉద్యోగం చేస్తున్న న్యాయమూర్తి ప్రతిరోజు కోర్టుకు వెళ్లి కేసులు వాదిస్తున్నారు. కోర్టు కేసులు వాదించని సమయంలో కోర్టు హాల్ కు అటాచ్ చేసిన రూమ్ లో కుర్చుని కేసు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో కోర్టు ఉద్యోగులు జడ్జితో మాట్లాడి వస్తున్నారు. ఎప్పటిలాగే కోర్టుకు వెళ్లిన జడ్జి ఆయన రూమ్ లో కుర్చుని కేసు ఫైల్స్ చూస్తున్నారు. ఆ సమయంలో అదే కోర్టులో పని చేస్తున్న ఓ ఉద్యోగి జడ్జి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లాడు. సార్ మీతో మాట్లాడాలని న్యాయమూర్తి అనుమతి కోరాడు. లోపలికి రావాలని జడ్జ్ చెప్పారు. రూమ్ లోకి వెళ్లిన ఉద్యోగి అదే రూమ్ లో కేసు ఫైల్స్ చూసుకుంటున్న న్యాయమూర్తితో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో జడ్జితో వాదనలకు దిగిన ఉద్యోగి సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా జోబులో ఉన్న కత్తి తీసుకుని జడ్జి మీద దాడి చేశాడు. న్యాయమూర్తి గట్టిగా కేకలు వెయ్యడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆ రూమ్ లోకి వెళ్లారు. తీవ్రగాయాలైన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తి మీద హత్యయత్నం చేసిన ఉద్యోగిని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న జిల్లా జడ్జి ఆసుపత్రి చేరుకుని న్యాయమూర్తి నుంచి వివరాలు సేకరించారు.

 క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తి

క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తి

తమిళనాడులోని సేలంలోని క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్ లోని ఓ కోర్టులో జస్టిస్ పొన్ పాండియన్ న్యాయమూర్తిగా ఉద్యోగం చేస్తున్నారు. క్రిమినల్ కోర్టులో జడ్జిగా ఉద్యోగం చేస్తున్న న్యాయమూర్తి పొన్ పాండియన్ ప్రతిరోజు సేలంలోని కోర్టు కాంప్లెక్స్ లోని ఆయన కోర్టుకు వెళ్లి కేసులు వాదిస్తున్నారు.

 కోర్టు రూమ్ లో ఉంటున్న న్యాయమూర్తి

కోర్టు రూమ్ లో ఉంటున్న న్యాయమూర్తి

కోర్టు కేసులు వాదించని సమయంలో జస్టిస్ పొన్ పాండియన్ కోర్టు హాల్ కు అటాచ్ చేసిన రూమ్ లో కుర్చుని కేసు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో కోర్టు ఉద్యోగులు జడ్జి పొన్ పాండియన్ మాట్లాడి వస్తున్నారు. ఎప్పటిలాగే కోర్టుకు వెళ్లిన జడ్జి పొన్ పాండియన్ ఆయన రూమ్ లో కుర్చుని కేసు ఫైల్స్ చూస్తున్నారు.

 ఉద్యోగం బదిలి విషయంలో న్యాయమూర్తితో గొడవ

ఉద్యోగం బదిలి విషయంలో న్యాయమూర్తితో గొడవ

ఆ సమయంలో అదే కోర్టులో పని చేస్తున్న ఉద్యోగి ప్రకాష్ జడ్జి పొన్ పాండియన్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లాడు. సార్ మీతో మాట్లాడాలని న్యాయమూర్తి పొన్ పాండియన్ అనుమతి కోరాడు. లోపలికి రావాలని ప్రకాష్ న్యాయమూర్తి పొన్ పాండియన్ చెప్పారు. రూమ్ లోకి వెళ్లిన ఉద్యోగి ప్రకాష్ అదే రూమ్ లో కేసు ఫైల్స్ చూసుకుంటున్న న్యాయమూర్తి పొన్ పాండియన్ తో ఉద్యోగం బదిలి విషయంలో గొడవ పెట్టుకున్నాడు.

 న్యాయమూర్తిని కత్తితో పొడిచేసిన ఉద్యోగి

న్యాయమూర్తిని కత్తితో పొడిచేసిన ఉద్యోగి

ఆ సమయంలో జడ్జి పొన్ పాండియన్ వాదనలకు దిగిన ఉద్యోగి ప్రకాష్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా జోబులో ఉన్న కత్తి తీసుకున్న ప్రకాష్ న్యాయమూర్తి పొన్ పాండియన్ మీద దాడి చేశాడు. కత్తిపోట్లు పడటంతో న్యాయమూర్తి పొన్ పాండియన్ గట్టిగా కేకలు వేశారు. న్యాయమూర్తి పొన్ పాండియన్ కేకలు వెయ్యడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆ రూమ్ లోకి వెళ్లారు.

Recommended Video

    Sushant గురించి మాట్లాడుతూ Heroine Sanjana లైవ్లో మేకప్.. నెటిజన్ల ట్రోల్స్ !
    బదిలి విషయంలోనే జడ్జితో !

    బదిలి విషయంలోనే జడ్జితో !

    తీవ్రగాయాలైన న్యాయమూర్తి పొన్ పాండియన్ ను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తి మీద హత్యయత్నం చేసిన కోర్టు ఉద్యోగి ప్రకాష్ ను తిరుచ్చి పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న జిల్లా జడ్జి కుమారగురు ఆసుపత్రి చేరుకుని న్యాయమూర్తి పొన్ పాండియన్ ను పరామర్శించి ఆయన నుంచి వివరాలు సేకరించారు. ఉద్యోగం బదిలి విషయంలో ప్రకాష్ న్యాయమూర్తి పొన్ పాండియన్ మీద హత్యాయత్నం చేశాడని పోలీసులు అన్నారు. కోర్టు ఆవరణంలోనే న్యాయమూర్తి పొన్ పాండియన్ మీద హత్యాయత్యం జరగడం తమిళనాడులో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+