షాక్: యువతిపై 4గురు, బాలికపై ముగ్గురు రేప్ చేసి నెట్లో పెట్టారు
లక్నో: రెండు రోజుల క్రితం నలుగురు యువకులు కాలేజీకి వెళ్తున్న ఓ యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంభాల్ జిల్లాలో జరిగింది. ఆమె పైన చెరుకు తోటలో ఘాతుకానికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో పెడతామని హెచ్చరించారు. అగ్రాలో ఓ మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.
ఈ నిందితులు అత్యాచారాల సంఘటనను వీడియో తీశారు. వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను వాట్సప్, యూట్యూబ్ ద్వారా అప్ లోడ్ చేసి తమ మరింత క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. అగ్రాలో జరిగిన ఘటన జనవరి 15న జరిగింది. అయితే, వారు బెదిరించడంతో ఆ మైనర్ బాలిక వారం రోజుల పాటు పెదవి విప్పలేదు.

పదిహేనేళ్ల ఆ మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు మంగళవారం నాడు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తమ తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో నిందితులు తమ ఇంటిలోకి వచ్చి తన పైన అత్యాచారానికి పాల్పడ్డారని, దానిని వీడియో తీశారని చెప్పింది. అనంతరం వాటిని యూట్యూబ్, వాట్సప్ ద్వారా అప్ లోడ్ చేశారని చెప్పింది.
ముగ్గురు నిందితులను నరేష్, జైవీర్, రాజేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు బెదిరించడంతో కొద్ది రోజుల పాటు బాలిక మౌనంగా ఉందని, అయితే, పక్కింటి వారు ఇందుకు సంబంధించిన వీడియోను నెట్లో చూసి చెప్పడంతో ఆ తండ్రికి తెలిసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications