Shock: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా, బిడ్డా నీళ్లు ఇవ్వు, నన్నే బిడ్డా అంటావారా అని రోడ్లోనే లేపేశాడు !

బెంగళూరు: స్నేహితులు సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిన తరువాత తమాషాగా చిన్నచిన్న బూతులు తిట్టుకోవడం సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే .అయితే ఇద్దరు యువకుల మద్య చిన్నగొడవ చిలికిచిలికి పెద్దది కావడంతో ఓ యువకుడు హత్యకు గురైనాడు. ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అంటూ ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏయ్ బిడ్డా కొంచెం నీళ్లు ఇవ్వు అని ఓ యువకుడు అడిగాడు. ఓరేయ్ నన్నే బిడ్డా అంటావరా అంటూ మరో యువకుడు రెచ్చిపోవడం చకచకా జరిగిపోయింది. బిడ్డా అని పిలిచిన పాపానికి మరో యువకుడు మూడుసార్లు కత్తితో కసక్ కసక్ అని పొడిచేయడంతో ఓ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 ఆటో డ్రైవర్లు

ఆటో డ్రైవర్లు

బెంగళూరు నగరంలోని జాలహళ్లి క్రాస్ లో సిద్దిక్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, సిద్దిక్ ఆటో డ్రైవర్. సిద్దిక్ కు కొంచెం గర్వం ఎక్కువ అని సమాచారం. బెంగళూరు నగరంలోని పిణ్యా సమీపంలో అజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అజయ్ కూడా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

 బేకరీ దగ్గర కలుస్తున్న ఆటో డ్రైవర్లు

బేకరీ దగ్గర కలుస్తున్న ఆటో డ్రైవర్లు

జాలహళ్లి క్రాస్ సమీపంలోని ఓ బేకరీ సమీపంలో ఆటో డ్రైవర్లు నిత్యం కలుస్తుంటారు. బేకరీ దగ్గర టీ తాగి దమ్ము కొట్టిన తరువాత కొంచెం విశ్రాంతి తీసుకుంటున్న ఆటో డ్రైవర్లు తరువాత బాడుగలు తిప్పుకోవడానికి వెళ్లిపోతుంటారు. ఇదే బేకరీ దగ్గరకు అజయ్, సిద్దిక్ వెళ్లి వస్తుంటారు. సిద్దిక్, అజయ్ కు పరిచయం అయ్యింది.

 ఏయ్ బిడ్డా..... కొంచెం నీళ్లు ఇవ్వు

ఏయ్ బిడ్డా..... కొంచెం నీళ్లు ఇవ్వు

ఆటో చెడిపోవడంతో సిద్దిక్ కష్టం మీద ఆ ఆటోను తోసుకుంటూ బేకరి దగ్గరకు వెళ్లాడు. ఎక్కువ శ్రమపడిన సిద్దిక్ ఏయ్ బిడ్డా కొంచెం నీళ్లు ఇవ్వు అని అజయ్ ని అడిగాడు. ఓరేయ్ నన్నే బిడ్డా అంటావరా అంటూ అజయ్ నోరుపారేసుకున్నాడు. ఆ సందర్బంలో అజయ, సిద్దిక్ మద్య మాటల యుద్దం సాగిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు. ఆ సందర్బంలో సిద్దిక్ రెచ్చిపోవడం చకచకా జరిగిపోయింది.

 మూడుసార్లు కసక్ అని పొడిచేసి హత్య

మూడుసార్లు కసక్ అని పొడిచేసి హత్య

సిద్దిక్ బిడ్డా అని పిలిచిన పాపానికి అజయ్ మూడుసార్లు కత్తితో కసక్ కసక్ అని పొడిచేశాడు. తీవ్రగాయాలైన సిద్దిక్ ను ఆసుత్తరికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరు: స్నేహితులు సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిన తరువాత తమాషాగా చిన్నచిన్న బూతులు తిట్టుకోవడం సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకుల మద్య చిన్నగొడవ చిలికిచిలికి పెద్దది కావడంతో ఓ యువకుడు హత్యకు గురైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+