వైరల్ వీడియో: కొత్త ఇంట్లో ప్రత్యక్షమైన నాగు పాము..
కొత్తగా నిర్మిస్తున్న ఆ ఇంట్లోకి ఓ భారీ నాగుపాము ప్రవేశించడంతో యజమానులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. ఆ నాగుపాము ఇంటి వద్ద ఉన్న నీటి తొట్టిలో దాక్కున్నట్లు గుర్తించారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును బంధించడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లోకి పాములు వస్తుంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎన్నో ఆశలతో అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటుంటే, అక్కడ ఊహించని అతిథి ప్రత్యక్షమై ఇంటి యజమానులను బెంబేలెత్తించింది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
తిరుపత్తూరు సమీపంలోని కరుప్పనూర్ ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ప్రస్తుతం నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తికావస్తున్న ఆ ఇంట్లో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రాజేష్ కుమార్ భార్య ముత్తులక్ష్మి ఇంటికి వెళ్లగా, అక్కడ ఒక భారీ నాగుపాము సంచరించడం చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

నీటి తొట్టిలో పాము..
పామును చూసి భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుపత్తూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా, ఆ నాగుపాము ఇంటి వద్ద ఉన్న నీటి తొట్టిలో దాక్కున్నట్లు గుర్తించారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును బంధించారు.
కొత్త ఇంట్లో అడుగుపెట్టకముందే భయంకర అనుభవం!
— oneindiatelugu (@oneindiatelugu) December 23, 2025
తిరుపత్తూరు సమీపంలో భారీ నాగుపాము చూసి ఉలిక్కిపడ్డ కుటుంబం#Snake #NewHouse #Tirupathur #ViralWatch #Oneindia #OITelugu
తిరుపత్తూరు సమీపంలోని కరుప్పనూర్లో రాజేష్ కుమార్ అనే వ్యక్తి నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. సాయంత్రం వేళ ఆ… pic.twitter.com/dyMNVMUUkg
ఈ సందర్భంగా ఇంటి యజమానురాలు ముత్తులక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. "మేము ఎంతో కష్టపడి, అప్పులు చేసి ఈ ఇల్లు కట్టుకుంటున్నాము. కానీ ఇక్కడ ఈ పాములు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications