దారుణం: తల్లి ప్రోత్సాహం, మైనర్ బాలికపై తండ్రి ఐదేళ్ళుగా లైంగికదాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

చతర్పూర్: కన్నతల్లి ప్రోత్సాహంతో కూతురిపై ఐదేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్న కిరాతక తండ్రి ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ దుర్మార్గాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే బాధితురాలితో పాటు ఆమె సోదరుడిని కూడ తీవ్రంగా బెదిరించారు.

వివాహేతర సంబంధం: రెండోసారి వచ్చి హత్యకు గురయ్యాడు

మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

సభ్యసమాజం తలదించుకొనే ఘటనకు తండ్రి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలనే మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.

మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకొస్తున్నాయి. కానీ, మహిళలపై లైంగికదాడులు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకొంటున్నా ఈ తరహ ఘటనలు మాత్రం చోటు చేసుకొంటున్నాయి.

కన్నకూతురిపై అత్యాచారం

కన్నకూతురిపై అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తార్పూర్‌లో కన్న కూతురిపై ఐదేళ్ళుగా కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మైనర్ బాలికపై ఈ దాడి కొనసాగుతోంది. కుటుంబసభ్యుల్లో బాధితురాలి సోదరుడు ప్రతిఘటించింది. భాదితురాలితో పాటు ఆమెను కూడ బెదిరించారు. తండ్రే యధేచ్చగా ఈ దారుణానికి పాల్పడుతున్నాడు

కన్నతల్లి ప్రోత్సాహం

కన్నతల్లి ప్రోత్సాహం

కన్నతల్లి ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించడం గమనార్హం. కన్నతల్లి కూడ మైనర్ బాలికపై లైంగిక దాడిని ప్రోత్సహించింది.ఏనాడూ కూడ ఈ దారుణాన్ని తల్లి అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. పైగా తండ్రిని కన్నతల్లి ప్రోత్సహించడం దారుణం. అయితే ఆమె ఎందుకు ఈ రకంగా వ్యవహరించిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బాధితురాలి సోదరుడు ప్రతిఘటన

బాధితురాలి సోదరుడు ప్రతిఘటన

తన సోదరిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్న విషయాన్ని గుర్తించిన సోదరుడు ఈ విషయమై నిలదీశాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. అయితే అతడిని తీవ్రంగా బెదిరించారు.దీంతో అతను కూడ ఏం చేయలేక మిన్నకుండిపోయాడు.

బంధువుల సహయంతో

బంధువుల సహయంతో

బంధువుల సహయంతో మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. బాధితురాలు ఇంటి నుంచి పారిపోయి తమ బంధువులకు జరిగిందంతా వివరించింది. వారు బాలికను వెంటబెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. తల్లితండ్రులిద్దరినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై నీచానికి ఒడిగట్టిన వారిద్దరికీ మరణ శిక్ష విధించాలని బాధిత బాలిక కోరుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 12-year-old girl from Madhya Pradesh was allegedly raped by her own father for more than five years. What's even more shocking is that the minor's mother, who was aware of the entire case, aided the father with the crime.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X