షాకింగ్: భార్య నగ్న చిత్రాల్ని సిటీ మొత్తం అతికించాడు
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఆ షాకింగ్. స్వయంగా ఓ భర్తనే తన భార్యకు చెందిన నగ్న ఫోటోలను నగరంలో అతికించాడు. ఈ షాకింగ్ సంఘటన ఐటీ సిటీ ఆఫ్ ఇండియా.. బెంగళూరుకు సమీపంలోని ఓ ప్రాంతంలో జరిగింది.
తన భార్య తనను వదిలి పెట్టడంతో ఓ సీనియర్ సిటిజన్ పూర్తి అసంతృప్తికి గురయ్యాడు. దీంతో, ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలను నగరం మొత్తంలో అతికించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరు వెంకటప్ప. వయస్సు 65. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటన జరిగింది బెంగళూరుకు 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగార్పేటలో అని తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ... వెంకటప్పకు ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పారు.
అయితే, కొద్ది రోజుల క్రితం వెంకటప్ప మొదటి భార్య అతనిని విడిచి పెట్టి వెళ్లింది. రెండో భార్యను వదిలిపెడితేనే నీ వద్దకు వస్తానని తేల్చి చెప్పింది. అయితే, అతను ఆ రెండో భార్యను వదిలేందుకు సిద్ధంగా లేడు.
అయితే, మొదటి భార్య పైన ఆగ్రహం వచ్చింది. దీంతో, ఆమె న్యూడ్ ఫోటోలను నగరంలో అతికించాడు. ఆ పోస్టర్లను ఆ మహిళకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు తొలగించారు. అతనికి మొదటి భార్యతో పెళ్లయి ముప్పయ్యేళ్లకు పైగా అవుతోంది.