Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిహార్ లోని 90 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. 130 మందిపై క్రిమినల్ కేసులు..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 202 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆర్​జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌ బంధన్‌ కూటమి ఈ ఎన్నికల్లో 35 స్థానాలకే పరిమితమైంది. అలాగే ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించలేకపోయింది. అయితే తాజాగా ఏడీఆర్ నివేదిక ప్రకారం.. బిహార్ లో 90 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులు.. 100 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్పష్టం అవుతోంది.

బిహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే 243 ఎమ్మెల్యేల్లో దాదాపు 53 శాతం ఎమ్మెల్యేలు అంటే 130 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అలాగే 90 శాతం మంది కోటీశ్వరులు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

SHOCKING 90 Bihar MLAs Are Crorepatis 100 Criminal Cases Exposed

241 మంది ఎమ్మెల్యేలను సమీక్ష జరపగా 42 శాతం గెలిచిన ఎమెల్యేల్లో అంటే 102 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 123 మంది అంటే 51 శాతం ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది.ఇక పార్టీల పరంగా క్రిమినల్ కేసులు ఓ సారి చూస్తే బీజేపీలో మొత్తం 89 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే జేడీయూలో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక ఆర్జేడీలో 18 మంది, లోక్ జన్ శక్తి పార్టీ నుంచి 11 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, ఏఐఎంఐఎం పార్టీ నుంచి నలుగురు, హామ్(ఎస్) పార్టీ నుంచి ఒకరు.. రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ నుంచి ఒకరు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒకరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఇక బిహార్ ఎమ్మెల్యేల్లో 90 శాతం అంటే దాదాపు 218 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. 2020 లో మొత్తం 241 మంది ఎమ్మెల్యేల్లో 194 మంది అంటే 81 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే జేడీయూ లో 85 ఎమ్మెల్యేల్లో 78 మంది అంటే 92 శాతం మంది కోటీశ్వరులు.. అలాగే బీజేపీలో 77 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు. ఆర్జేడీలో 24 మంది అలాగే లోక్ జన్ శక్తి పార్టీ లో 16 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు. ఏఐఎంఐఎం నుంచి 5 గురు, హామ్(ఎస్) పార్టీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒకరు, అలాగే బీఎస్పీ నుంచి ఒకరు కోటీశ్వరులుగా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+