Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాప్ యూట్యూబర్, బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై బుల్లెట్ల వర్షం

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. భారీగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. దాదాపుగా 24 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఆ యూట్యూబర్.. ఎల్విస్ యాదవ్. గుర్ గావ్ సెక్టార్ 57లో నివాసం ఉంటోన్నాడు. ఈ తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల మధ్య కాల్పులు జరిగాయి. బైక్‌లపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో ఎల్విస్ యాదవ్.. ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది.

Shocking Attack Gunfire Erupts Outside YouTuber Elvish Yadav s Home

సమాచారం అందిన వెంటనే గుర్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్నవారి భద్రత గురించి ఆరా తీశారు. పోలీసులు ప్రాంతాన్ని చుట్టుముట్టి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దాడి చేసిన వారిని గుర్తించలేకపోయారు.

ఎల్విష్ యాదవ్ తన యూట్యూబ్, సోషల్ మీడియా కార్యకలాపాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే- అనేక వివాదాలకూ కేంద్రబిందువు. ఇదివరకు బాలీవుడ్ సింగర్ ఫాజిల్ పూరియాపై కూడా కాల్పులు జరిగాయి. ఈ ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్‌పై జరిగిన ఈ దాడులు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి ఘటనలు పెరగడం ఆ ప్రాంత భద్రతా లోపాలను వెల్లడిస్తున్నాయి.

ఎల్విష్‌ ఇంటిపై దాడికి ముందు, హర్యానాకే చెందిన బాలీవుడ్ సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియాపై ఈ ఏడాది జూలై 14వ తేదీ సాయంత్రం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గురుగ్రామ్‌లోని ఎస్‌పీఆర్ రోడ్డులో గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు అప్పట్లో. ఆ తర్వాత అలాంటి ఘటన ఏదీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఎల్విష్ యాదవ్ యూట్యూబ్ వ్లాగ్స్, రోస్ట్ వీడియోలకు భారీగా ఫాలోయింగ్ ఉంటోంది. అతనికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఎల్విష్ గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. రేవ్‌ పార్టీ, పాము విషం కేసులు అతన్ని చుట్టుముట్టాయి. దరాంగ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, రాజస్థాన్ పోలీసులు తప్పుడు ఆరోపణలు, పలుమార్లు గొడవలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాలే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+