తల్లేనా?: ఏడాదిన్నర కొడుకును విసిరేసి, చెప్పుతో కొట్టి, తొక్కేసింది(వీడియో)
ఢిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన 18నెలల బాబు పట్ల రాక్షసంగా ప్రవర్తించింది.
ఢిల్లీ: అమ్మంటే తమ సంతానాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా వారి సుఖసంతోషాలత కోసం పరితపిస్తుంది. కానీ, దేశ రాజధానిలో జరిగిన ఘటన చూస్తే మాత్రం ఆ మహిళ అసలు తల్లేనా? అనే సందేహం కలగకమానదు.
ఢిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన 18నెలల బాబు పట్ల రాక్షసంగా ప్రవర్తించింది. సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఆమె కర్కశత్వం వెలుగుచూసింది. ఆ వీడియోలో షబ్నం..
ఆ బాబును నేలకు విసిరికొట్టి.. కాలికి ఉన్న చెప్పు తీసి కర్కశంగా కొట్టింది. అంతటితో ఆగకుండా, పలుమార్లు బాబును కాలితో తొక్కేసింది.
అభంశుభం తెలియని ఆ బాబు.. నొప్పిని తట్టుకోలేక విలవిలలాడిపోయాడు. వెంటనే కుటుంబంలోని మరో మహిళ వచ్చి ఆ బాబును తీసుకెళ్లింది. కాగా, షబ్నం రాక్షసత్వంపై ఆమె అత్తామామలు ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షబ్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications