కూతురు పేరు చెప్పి, యువతిని సీక్రెట్‌గా: క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన ప్రియాంక గుసైన్ తమకు ఎదురైన చేదు అనుభవం గురించి సామాజిక అనుసంధాన వేదికలో పోస్ట్ చేసింది.

ఓ మహిళా ఉద్యోగి ప్రయాణిస్తు్నన క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్న సదరు యువతి చాణక్యపురిలోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.

Shocking: Delhi girl caught Ola driver

ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లేందుకు ఓ క్యాబ్ ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ అద్దంలో నుంచి ఆమెను సెల్ ఫోనుతో ఫోటోలు, వీడియోలు తీయడం గుర్తించింది.

దీంతో, ఏం చేస్తున్నావని అతనిని ప్రశ్నించింది. తన కూతురు ఫోటోలను సెల్ ఫోనులో చూస్తున్నానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అతని నుంచి సెల్ ఫోన్ తీసుకొని చూడగా తన ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As if Ola wasn’t giving its riders enough nasty nightmares, here’s another incident to make one dread taking an Ola ride. Delhi resident Priyanka Gusain posted about an incident that took place in the capital while travelling back to Chanakyapuri in an Ola cab.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి