ఢిల్లీ క్యాబ్ రేప్‌లో షాకింగ్ వివరాలు: మహిళను కొరికాడు, కొట్టాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాబ్ రేప్ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శివకుమార్ యాదవ్ కారులో మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా శారీరకంగా ఆమెను హింసించాడు. తాను మహిళను పలుమార్లు కొట్టినట్లు, నేరం చేస్తూ మహిళను కొరికినట్లు యాదవ్ పోలీసు విచారణలో వెల్లడించాడు. కాగా, పోలీసులు యాదవ్ వాడిన రెండు మొబైల్స్‌ను, కొన్ని దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. వచ్చే 20 రోజుల్లో కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పార్లమెంటు సముదాయంలో కలిశారు. ఢిల్లీ అత్యాచారం కేసు గురించి, సంబంధిత విషయాల గురించి ఆయన హోం మంత్రికి వివరించారు. క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కాంట్రాక్టుకు పెట్టుకున్న పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బస్సీ ఆ తర్వాత మీడియాతో చెప్పారు. తాము న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని, ఉబేర్‌పై కేసు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇదిలావుంటే, సంఘటనపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారంనాడు రాజ్యసభలో ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్‌సిటిలో ఉబేర్ క్యాబ్ సర్వీసును నిషేధించినట్లు ఆయన తెలిపారు. వెబ్ సంబంధిత క్యాబ్ బుకింగ్ సర్వీసులను నిషేధించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సంఘటనకు సంబంధించిన కారు నిందితుడికి చెందిందేనని కూడా ఆయన చెప్పారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది.
ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications