కండోమ్స్ గుట్ట.. 150 మంది ప్రియుళ్లు: ఓ నర్స్ దారుణ హత్య వెనుక విస్తుపోయే నిజాలు!
తమిళనాడులోని తేనీ జిల్లా పప్పమ్మల్‌పురంలో జరిగిన ఓ హత్య కేసు దర్యాప్తు పోలీస్ అధికారులనే దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ సాధారణ నర్స్ హత్య వెనుక దాగి ఉన్న రహస్యాలు, అక్రమ సంబంధాల నెట్వర్క్ వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 2021లో జరిగిన ఈ సంచలన హత్యకేసు అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మల్‌పురానికి చెందిన సురేష్ దిండిగుల్‌లో క్యాటరర్‌గా పనిచేస్తుండేవాడు. అతని భార్య సెల్వి అండిపట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ నర్సుగా పనిచేసేది. వీళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు. సురేష్, సెల్వి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన అనంతరం సెల్వి అండిపట్టిలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసించేది.

ఈ క్రమంలో 2021, నవంబర్ 24న ఆమె తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైంది. పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆధారాల కోసం పోలీసులు ఇల్లు మొత్తం వెతకగా.. అక్కడ లభించిన 500 హై క్వాలిటీ కండోమ్స్ చూసి అవాక్కయ్యారు. ఓ మహిళ ఇంట్లో ఇన్ని కండోమ్స్ ఎందుకు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు సెల్వి కాల్ డేటా, ఫోన్ కాంటాక్ట్స్‌ను పరిశీలించగా.. దాదాపు 300 నంబర్లు లభించాయి. అందులో చాలా మంది మగాళ్లతో ఆమె అఫైర్ నడిపినట్లు తేల్చారు. ఆ కాంటాక్ట్స్ లోని 150 మంది మగాళ్లతో ఆమె ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారితో శృంగారం చేసేదని విచారణలో తేలింది. ఆమెతో వివాహేతర సంబంధం నడిపిన వారిలో ప్రముఖులు చాలా మంది ఉన్నట్లు తెలిసి పోలీసులు విస్తుపోయారు. వీరిలో వైద్యులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు, ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. వీరందిరితోనూ ఆమె క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించేందుకు ఈ స్థాయిలో కండోమ్స్ సిద్ధం చేసుకున్నట్లు విచారణలో తేలింది.
కేసు దర్యాప్తులో భాగంగా.. కంబం ప్రభుత్వాస్పత్రి పనిచేసే రామచంద్రప్రభు అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన మరుసటి రోజే అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసుల దృష్టి అతనిపై మరింత బలంగా పడింది. గతంలో వీరిద్దరూ ఒకే ఆస్పత్రిలో పనిచేసిన సమయంలో పరిచయం ఏర్పడి ఎఫైర్ కు దారితీసింది. హత్య జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. రామచంద్రప్రభు సెల్వి ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్పష్టమైంది. అంతే కాకుండా అదే రోజు సాయంత్రం సెల్వి బంగారు గొలుసును అతను ఓ తాకట్టు దుకాణంలో కుదవపెట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఘటనా స్థలంలో దొరికిన ఫుట్ ప్రింట్స్ రామచంద్రప్రభువేనని తేలింది.
హత్యకు అసలు కారణం ఇదే..
రామచంద్రప్రభు భార్యను విచారించగా.. తన భర్త సెల్వికి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడని తెలిసింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఆ కోపంతోనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. అరెస్ట్ భయంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమైంది. ఈ దారుణ హత్య వెనుక ఉన్న హంతకుడిని తేల్చడంతో పాటు ఆమె వల్ల నష్టపోయిన అనేక కుటుంబాల గుట్టును ఈ కేసు విచారణ బయటపెట్టింది. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు పోలీసులు అసలు హంతకుడు ఎవరో తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి మరెన్నో క్రైమ్ మిస్టరీల కోసం వన్ ఇండియా తెలుగును ఫాలో అవ్వండి.














Click it and Unblock the Notifications